Stock Market : మూడు రోజుల క్షీణత తర్వాత శుక్రవారం స్టాక్ మార్కెట్ కోలుకుంది. సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా 104 పాయింట్ల లాభంతో ముగిసింది. దీపావళికి ముందు స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు సామాన్య పెట్టుబడి దారుడిని దివాళా తీయించింది. మొత్తానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దేశ ఖజానా నుంచి దాదాపు రూ.90,370 కోట్లు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల మొత్తం భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత కనిపించగా, గత ఐదు రోజుల్లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో మొత్తంగా 616 పాయింట్లకు పైగా క్షీణత నమోదైంది. గురువారం ఒక్కరోజే ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా సాధారణ ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్లో తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వల్లో కూడా ఇదే విధమైన క్షీణత కనిపించింది.
10.75 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 11తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 10.75 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 90,370 కోట్లు) తగ్గి ఇప్పుడు 690.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇటీవలి కాలంలో పడిపోవడం ఇదే అతిపెద్దది. గత వారంలో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 3.70 బిలియన్ డాలర్లు తగ్గి 701.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.సెప్టెంబరు చివరి నాటికి విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.88 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ మారక నిల్వలలో డాలర్ కాకుండా యెన్, యూరో, పౌండ్ వంటి కరెన్సీలు కూడా విదేశీ మారక నిల్వలలో ఉంచబడతాయి. వాటి మొత్తం గణన మాత్రమే డాలర్లలో లెక్కించడం జరుగుతుంది. అయితే, ఇది దేశం మొత్తం ఫారెక్స్ రిజర్వ్‌లో భాగం. ఇది కాకుండా, దేశంలోని బంగారం నిల్వల విలువ 98 మిలియన్ డాలర్లు తగ్గి 65.66 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 86 మిలియన్ డార్లు తగ్గి 18.34 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, సమీక్షలో ఉన్న వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద భారతదేశం నిల్వలు 20 మిలియన్ డాలర్లు తగ్గి 4.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా భారత్ చైనాను అధిగమించింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్, అనుకూలమైన రుతుపవన పరిస్థితులు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వ చొరవ వంటి కారణాల వల్ల భారతదేశం అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2024 ప్రథమార్థంలో ద్విచక్ర వాహన విక్రయాలు 4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో వృద్ధి భారత్‌లోనే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో కూడా కనిపించింది.