Loan For Prisoners: సాధారణంగా సామాన్య ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థలం లేదా ఇల్లు లేదా పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా బంగారం తాకట్టు పెడితే మాత్రమే రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాంకును బట్టి లోన్ నిబంధనలలో మార్పులు ఉంటాయి.
బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకోవడం సులువే అయినా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైదీలకు కూడా రుణాలు అందే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జైలు శిక్ష అనుభవించే వ్యక్తుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: CM KCR: కేసీఆర్ లో టెన్షన్ మొదలైందా.. పర్‌ఫెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారా..?
తక్కువ వడ్డీరేటుతో ఎలాంటి గ్యారంటీ లేకుండానే ఖైదీలు రుణం తీసుకునే అవకాశాన్ని మహారాష్ట్ర సర్కార్ కల్పిస్తోంది. ఖైదీలు 50,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పుణెలోని యరవాడా జైలులో ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఈ లోన్ తీసుకున్న వాళ్లకు వడ్డీరేటు 7 శాతంగా ఉండనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువ వడ్డీరేటుకు రుణాలను మంజూరు చేస్తున్నాయి.
కొన్ని బ్యాంకులలో ఈ వడ్డీరేటు 24 శాతం వరకు ఉందనే సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న 1,000 మంది ఖైదీలకు మొదట రుణం అందనుందని బోగట్టా. పర్సనల్ గ్యారంటీ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలను మంజూరు చేస్తోందని సమాచారం అందుతోంది.