Soundbar massive discount: పండుగల సందర్భంగా కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్స్ అందిస్తుంటాయి. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా కొన్ని కంపెనీలు వస్తువులను తక్కువ ధరకే అందిస్తుంటాయి. 2026 రిపబ్లిక్ డే సందర్భంగా AMAZON కొన్ని వస్తువులపై తగ్గింపు తలను ప్రకటించింది. వాటిలో Zebronics Sound Bar ఒకటి. డాల్బీ సౌండ్ కావాలని అనుకునే వారికి ఈ సౌండ్ బార్ అనుకూలంగా ఉంటుంది. అలాగే టీవీకి అదనంగా సెట్ చేసుకోవడానికి.. మంచి ఆడియో వినడానికి ఇది వినసొంపుగా ఉంటుంది. మార్కెట్లో ఉన్న దీని రేటు పై భారీగా డిస్కౌంట్ ప్రకటించారు. ఇంతకీ దీనిని ఎంత తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు ఇప్పుడు చూద్దాం..
Zebronics కంపెనీకి చెందిన 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ప్రస్తుతం మార్కెట్లో రూ.44,999 తో విక్రయిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఆమెజాన్ సంస్థ దీనిపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. అమెజాన్ ద్వారా దీనిని కొనుగోలు చేసిన వారికి రూ.10,000 వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే దీనిని ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 రూపాయల అదనపు తగ్గింపు ఉండనుంది. ఈ రెండు ఆఫర్లతో కొనుగోలు చేస్తే రూ.33,499 కే దీనిని సొంతం చేసుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ వరకు రావడంతో చాలామంది యూత్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఫీచర్లు ఉండడమే ఇందుకు కారణం.
ఈ సౌండ్ బార్ లో 7.2.4 సెటప్ తో పని చేస్తుంది. దీని ముందు మూడు స్పీకర్లు, రెండు ఆఫ్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. సైడ్ లో మరో రెండు స్పీకర్లు కలిగి సరౌండ్ సౌండ్ నేను అందిస్తుంది. అలాగే దీనికి సరౌండ్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. మొత్తం ఈ సౌండ్ 1100 W తో పనిచేస్తుంది. దీంతో పెద్దపెద్ద సంగీతాలను వినసొంపుగా.. ఆకర్షనీయంగా వినవచ్చు. అంతేకాకుండా దీనిని ఇంట్లో సెటప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సినిమా థియేటర్లలో వచ్చే DTS సౌండ్లు ఇందులో అనుభూతి పొందవచ్చు. Zebronics సౌండ్ బార్ లో 3D సౌండ్ కూడా వినవచ్చు. ఇందులో HDMI e ARC కూడా ఉంటుంది. అలాగే USB కోర్టు తో పాటు మల్టీ కనెక్టివిటీ, బ్లూటూత్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే ఆన్లైన్ లో 4.1 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. అంతేకాకుండా టీవీకి అదనంగా దీనిని సెట్ చేసుకోవడానికి చాలామంది కొనుగోలు చేయాలని చూస్తున్నారు.