Best Selling Car: ఆటోమోబైల్ రంగంలో కార్ల కంపెనీలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వినియోగదారుల డిమాండ్ మేరకు ఉత్పత్తి చేస్తూ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ఏడాదికేడాది విక్రయాలు పెంచుకుంటూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి. కారు కొనాలనుకునేవారికి అనుగుణంగా ఫీచర్స్ ను అప్డేట్ చేస్తూ కొత్త రకమైన వాహనాలు అందుబాటులోకి తీసుకురావడంతో కార్ల కొనుగోలు సంఖ్య పెరిగిపోతుంది. 2023 ఏడాదిలో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కంపెనీలు గత ఏడాది కంటే ఎక్కువ యూనిట్లు అమ్మి లాభాలను తెచ్చుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 4,108,000 యూనిట్లు విక్రయించారు. ఇది 2022 కంటే ఎక్కువ కావడం విశేషం. 2023లో ఏ కంపెనీ ఎన్ని కార్లు విక్రయాలు జరుపుకుందో పరిశీలిద్దాం..
దేశంలో ప్రతీ ఏడాది మారుతి సుజుకీ కార్ల విక్రయాల్లో ముందంజలో ఉంటోంది. తన కంపెనీకి చెందిన 10 కార్లలో 7 మోడళ్లు అత్యధికంగా విక్రయాలు జరిపింది. వీటిలో అన్నింటికంటే మొదటిస్థానంలో స్విప్ట్ చేరింది. ఈ సంవత్సరంలో మారుతి స్విప్ట్ 2,03,469 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఆ తరువాత మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ 2,01,302తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత బాలెనో 1,93,988, సుజుకీ బ్రెజ్జా 1,70,588 యూనిట్లు అమ్మింది.
మారుతి తరువాత టాటా కంపెనీ కూడా అమ్మకాల్లో ఊపందుకుంది. ఈ కంపెనీ నుంచి ఫేవరెట్ గా నిలిచిన నెక్సాన్ 1,70,311 విక్రయాలు సొంతం చేసుకుంది. ఇదే కంపెనీ నుంచి పంచ్ సైతం 1,50,182 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. వీటికి తోడు హ్యుందాయ్ క్రెటా 1,57,311 అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న కంపెనీల్లో నిలిచింది. అయితే మారుతి నుంచి 4 మోడళ్లు ఫస్ట్ లిస్టులో నిలచి.. ఆ తరువాత టాటా, హ్యుందాయ్ మోడళ్ల తరువాత మళ్లీ మారుతి మోడళ్లు నిలిచాయి. వీటిలో మారుతి సుజుకీ ఈకో 1,36, 010.. ఎర్టిగా 1,29,967 యూనిట్లు ఉన్నాయి.
మిడ్ సైజ్ ఎస్ యూవీ ఫేవరెట్ గా నిలిచిన టాటా పంచ్ ను హ్యుందాయ్ ఎక్కువ అమ్మకాలు జరిపింది. గతేడాది పంచ్ దూసుకుపోయినా ఈసారి 1,50,182 విక్రయాలు జరిగినా.. హ్యుందాయ్ క్రెటా 1,57,311 యూనిట్లతో దూసుకెళ్లింది. ఎంపీవీ విభాగంలో మారుతి సుజుకీ ఈకో 1,36, 010.. ఎర్టిగా 1,29,967 అమ్మకాలతో పోటీపడింది. మొత్తంగా ఈ ఏడాది బెస్ట్ సెల్లర్ కారుగా మారుతి స్విప్ట్ నిలిచింది. అలాగే మూడు కంపెనీల మధ్య పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది.