Under Rs 7 Lakhs Cars : ఆటోమోబైల్ రంగంలో అప్పుడప్పుడు సంచలనాలు క్రియేట్ చోటుచేసుకుంటాయి. ఊహించని రీతిలో మోడళ్లు, ఆకర్షించే ఫీచర్లతో కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇప్పటి వరకు పోటీపడి చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా రకరకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే మరింత ఆకర్షించేవిధంగా కొన్ని కంపెనీలు అద్భుత ఫీచర్లను జోడిస్తున్నారు. లేటేస్టుగా డిఫరెంట్ ఫీచర్లతో న్యూ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ‘కియా’. మారుతీ సుజుకీ, మహీంద్రాలతో పోటీ పడుతూ తీసుకొచ్చిన ఈ కారు గురించి విశేషాలు తెలుసుకుందాం..
దక్షిణ కొరియా దేశానికి చెందిన ‘కియా’ భారత మార్కెట్లలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ కంపనీ నుంచి విడుదలయైన చాలా మోడళ్లను కారు లవర్స్ యాక్సెప్ట్ చేశారు. ఆ ఉత్సాహంతో లేటేస్టుగా పికాంటో మోడల్ ను అప్డేట్ చేసి డేటేడ్ వెర్షన్ ను మార్కెట్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ మోడల్ కారు ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు దీనిని భారత్ రోడ్లపై తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కియా కంపెనీకి చెందిన పికాంటో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ మోడల్ 83bhp పవర్, 122 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ సౌకర్యం కూడా ఉంది. అయితే గరిష్టంగా 100 బీహెచ్ పీ శక్తిని, 172 ఎన్ఎం టార్క్ ను కూడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే ఇవన్నీ ఆన్లౌన్లో లీకైన ఫీచర్లు మాత్రమే. అధికారికంగా ఇప్పటి వరకు కంపెనీ నుంచి వెలువడలేదు. ఇక వాటి ఫీచర్ల విషయానికొస్తే రెండు వైపులా ఎల్ ఈడీ లైట్లను అమర్చారు. డ్యాష్ బోర్డ్ ఫ్రీ-స్టాండింగ్ 8 ఇంచెల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంది.
కారు స్టీరింగ్, వీల్స్, ఇతర ఇంటిరీయర్స్ మొత్తం అవుట్ గోయింగ్ మోడల్స్ ను కలిగి ఉన్నాయి. మిగతా కార్ల వలె ఎయిర్ బ్యాగ్స్ రక్షణ ఇస్తాయి. ఈ మోడల్ ప్రారంభం ధర కేవలం రూ.7లక్షల నుంచే మొదలవుతోంది. హ్యుందాయ్, టాటా టియాగో, ఫోక్స్ వ్యాగన్ లకు పోటీగా దీనిని ఉత్పత్తి చేశారు. మారుతి స్విఫ్ట్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ మోడల్ ను పరిశీలిస్తే ఇంప్రెస్ అవుతారని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు.