Credit Cards: ప్రపంచమంతా టెక్నాలజీ మయం అవుతోంది. దీంతో ప్రతి పని కోసం సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వస్తుసేవల మార్పిడి నుంచి నగదు మార్పిడి చాలా కాలాంగా చెలామణిలో ఉంది. ఇది చేతి ద్వారా ఎక్కువగా జరిగేది. కానీ కరోనా కాలం నుంచి డిజిటలైజేషన్ అవుతోంది. నగదు ట్రాన్స్ ఫర్లు ఎక్కువగా ఆన్లైన్లో జరగడంతో అందరూ దీనికి అలవాటైపోతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులు వినియోగదారుల ట్రాన్సాక్షన్లను భట్టి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకులు ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ చేసిన వారికే ఈ కార్డులను జారీ చేసేవారు. కానీ ఇప్పుడు పరమితులను తగ్గించి సామాన్యులకు సైతం క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు. ప్రస్తుతం ఏ యే బ్యాంకు నుంచి ఎంతమంది క్రెడిట్ కార్డులు తీసుకుతన్నారో చూద్దాం.
చిరుద్యోగులు సైతం నేటి కాలంలో క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండడం విశేషం. రివార్డు పాయింట్స్, క్యాష్ బ్యాక్ ఆపర్లు, వడ్డీ లేకుండా 50 రోజుల పాటు వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఇవ్వడంతో దీనిని తీసుకునేందుకు ఆసక్తి చూపతున్నారు. ప్రభుత్వం సైతం డిజిటల్ పేమేంట్ ను ప్రోత్సహించడంతో క్రెడిట్ కార్డుల అవసరం పెరిగిపోతుంది. ఈ తరుణంలో కొన్ని బ్యాంకులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కేవలం ఆ బ్యాంకులు మాత్రమే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డులు జారీ చేశాయి.
భారత్ తో దాదాపు 71 శాతం క్రెడిట్ కార్డులు ఆ నాలుగు బ్యాంకులకు చెందినవే ఉన్నాయి. వాటీలో హెచ్ డీఎప్ సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు. తమ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నవారితో పాటు కొత్త వారికి తక్కువ పరిమితితో కార్డులను జారీ చేస్తున్నాయి. కొన్ని డిజిటల్ పేమేంట్ల విషయంలో ఎలాంటి చార్జీలు లేకుండా ఇవ్వడంతో ఈ బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డులు తీసుకున్నవారు హెచ్ డీఎఫ్ సీ నుంచి 1.78 కోట్ల మంది ఉన్నారు. ఆ తరువాత స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా నుంచి 1.68 కోట్లు, ఐసీఐసీఐ నుంచి 1.45 కోట్లు, యాక్సిస్ బ్యాంకు నుంచి 1.22 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో యావరేజ్ గా రూ.3643ను క్రెడిట్ కార్డు నుంచి ట్రాన్సాక్షన్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక క్రెడిట్ కార్డు నుంచి ప్రతీనెల యావరేజ్ వినియోగదారులు రూ.15,388 ఖర్చు చేస్తున్నారు. వస్తుసేవలతో పాటు ఆన్లైన్లో కొనుగోలుకు క్రెడిట్ కార్డును ఎక్కువగా వాడుతున్నారు.