Credit-Cards doubts
నేటి కాలంలో చాలా మంది బ్యాంకు క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. కిరాణం షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు వస్తువుల కొనుగోలుపై క్రెడిట్ కార్డు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కొందరు రూపే కార్డును కూడా పొంది డెబిట్ కార్డు కంటే ఎక్కువగా వాడుతున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల మే 22న క్రెడిట్ కార్డులు పనిచేయడం లేదు. రెండు బ్యాంకులకు సంబంధించిన కార్డులు పనిచేయవని బ్యాంకులు ముందే తమ ఖాతాదారులకు మెసేజ్ పంపించారు. ఇంతకీ ఏ బ్యాంకు క్రెడిట్ కార్డులో తెలుసా?
బ్యాంకుల్లో ప్రముఖంగా కొనసాగుతున్న వాటిలో HDFC, AXIS బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకు సెక్టార్ లో ఎస్బీఐ తరువాత హెచ్ డీఎఫ్ సీ కీలకంగా కొనసాగుతుంది. ఈ బ్యాంకులకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నాయి. వీరిలో చాలా మందికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీతో పాటు యాక్సిస్ బ్యాంకూ కొన్ని వ్యవహారాల్లో కీలకంగా ఉంటోంది. ఈ బ్యాంకు కార్డుల ద్వారా నేరుగా షాపింగ్ మాల్స్ లోనే కాకుండా ఆన్ లైన్ లోనూ ట్రాన్జాక్షన్ కు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్డుల ద్వారా వివిధ ఆఫర్లు వర్తిస్తాయి.
అయితే మే 22న ఉదయం 12.30 గంటల మరుసటి రోజు ఉదయం 2.15 గంటల వరకు హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులు పనిచేయవు. ఎవరైనా క్రెడిట్ కార్డులతో వ్యవహారాలు జరిపేవారు వాయిదా వేసుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. ఇక యాక్సిక్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇదే రోజు ఉదయం 2.15 గంటల నుంచి 3.00 గంటల వరకు పనిచేయవని ఆ బ్యాంకు సిబ్బంది తెలిపారు. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
అయితే ఈ సమయం ఇప్పటికే పూర్తయినా చాలా మంది ఖాతాదారులు ఆ సమయంలో ట్రాన్జాక్షన్లు పెద్దగా లేకపోవడంతో ఇబ్బందులు పడలేదు. సాధారణ సమయంలో అంతరాయం కలిగితే ఇబ్బందులు ఉండేవని కొంత మంది ఖాతాదారులు వాపోయారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: These bank credit cards do not work