Today Stocks to Watch : హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన ఈక్విటీ షేర్లను జాబితా చేయనుంది. ఇందులో రూ. 2,500 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్స్ ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో హెచ్‌డీబీఎఫ్ఎస్ నికర లాభం 2.6 శాతం వృద్ధితో రూ.580 కోట్లకు చేరుకోగా, రుణ పుస్తకం 30 శాతం పెరిగి రూ. 95,600 కోట్లకు చేరింది.
వొడాఫోన్ ఐడియా..
ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు తీర్పుతో కంపెనీ ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఇన్వెస్టర్ల సమావేశం జరగనుంది. వొడాఫోన్ ఐడియా తన 4జీ, రాబోయే 5జీ నెట్వర్క్ ను విస్తరించేందుకు నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్ తో మూడేళ్లకు గానూ, 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో దీని షేర్లు 10శాతం మేర పెరిగాయి.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్..
గోల్డ్ లోన్ పోర్ట్ పోలియో.. క్షీణించడంతో కేర్ రేటింగ్స్ ఐఐఎఫ్ఎల్ దీర్ఘకాలిక సాధనాలను తగ్గించింది. ఇటీవల ఆర్బీఐ ఆంక్షలను ఎత్తేసినప్పటికీ. కంపెనీ తన మార్కెట్ వాటా తిరిగి పొందే సామర్థ్యం కీలకంగా ఉంది.
టాటా స్టీల్..
ఒడిశాలోని కళింగనగర్ ప్లాంట్ లో టాటా స్టీల్ కొత్త బ్లాస్ట్ ఫర్నేస్ ను ప్రారంభించింది, దీని సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 8 మిలియన్ టన్నులకు పెంచింది. పెల్లెట్ ప్లాంట్, కోక్ ప్లాంట్ వంటి సౌకర్యాలతో ఒడిశాలోని ప్లాంట్ సామర్థ్యం 14.6 మిలియన్ టన్నులుగా ఉంది.
మ్యాన్కైండ్ ఫార్మా..
భారత్ సీరమ్స్, వ్యాక్సిన్ల కొనుగోలుకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, వాణిజ్య పత్రాల ద్వారా రూ. 10,000 కోట్ల వరకు సమీకరించనుంది.
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్..
ప్రమోటర్ల నుంచి రూ. 1,100 కోట్లు, ముంబైకి చెందిన ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,910 కోట్లు సహా నిధుల సమీకరణ ప్రయత్నాన్ని కంపెనీ ప్రకటించింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్స్ (క్యూఐపీ) ద్వారా రూ. 6,000 కోట్లకు పైగానే సమీకరించుకోవాలని రిలయన్స్ ఇన్ ఫ్రా యోచిస్తోంది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ 1×800 మెగావాట్ల సిపాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఈపీసీ ప్యాకేజీ కోసం ఎన్టీపీసీ నుంచి బీహెచ్ఈఎల్ రూ. 6,100 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది.
అదానీ టోటల్ గ్యాస్..
అదానీ గ్రూప్, ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీస్ మధ్య సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జాయింట్ వెంచర్ గ్లోబల్ రుణదాతల నుంచి 375 మిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ ప్యాకేజీని పొందింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో ఇది అతిపెద్ద గ్లోబల్ ఫండింగ్ ఇనిషియేటివ్.
స్పైస్ జెట్..
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు 48.7 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ. 61.60 చొప్పున జారీ చేసేందుకు ఎయిర్ లైన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
ఆర్తి డ్రగ్స్..
మహారాష్ట్రలోని తారాపూర్ లోని ఆర్తి డ్రగ్స్ ఏపీఐ తయారీ కేంద్రాన్ని సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు యూఎస్ఎఫ్డీఏ తనిఖీ చేసింది. ఫారం-483లో కంపెనీ 7 తనిఖీ పరిశీలనలను అందుకుంది. వీటిలో ఏదీ డేటా సమగ్రతకు సంబంధించింది కాదు.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) తమ లాజిస్టిక్స్, ట్రేడింగ్ ప్లాట్ పామ్ లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించేందుకు రోరిక్స్ హోల్డింగ్స్ తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కమోడిటీ ట్రేడింగ్ ను మార్చేందుకు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. ప్రముఖ గ్లోబల్ ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ గా ఎదగాలన్న తమ వ్యూహంలో ఈ సహకారం కీలకమని ఏపీఎస్ఈజెడ్ సీఈఓ కరణ్ అదానీ ఉద్ఘాటించారు.
ఓఎన్జీసీ అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ అజర్బైజాన్ లోని అజెరి-చిరాగ్-డీప్వాటర్ గుణషిలి (ఏసీజీ) క్షేత్రానికి నాన్ అసోసియేటెడ్ గ్యాస్ ఒప్పందం కుదుర్చుకుంది. క్షేత్రం నాన్-అసోసియేటెడ్ నేచురల్ గ్యాస్ (ఎన్ఎజీ) వనరులు గణనీయంగా ఉన్నాయని అంచనా వేయబడింది. సుమారు నాలుగు ట్రిలియన్ క్యూబిక్ అడుగుల (టీసీఎఫ్) గ్యాస్ ఉంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More