https://oktelugu.com/

Hero Motocorp: రూపాయి చెల్లించి కొత్త స్కూటీని కొనుగోలు చేసే అవకాశం.. ఎలా అంటే?

Hero Motocorp: హీరో మోటోకార్ప్ కొత్త స్కూటీని కొనుగోలు చేయాలని కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాలలో ఈ ఆఫర్ అమలవుతుండగా మార్చి 11వ తేదీ వరకు ఈ ఆఫర్ అమలులో ఉండనుంది. సమీపంలోని హీరో షోరూమ్ ను సందర్శించడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2022 11:44 am
    Follow us on

    Hero Motocorp: హీరో మోటోకార్ప్ కొత్త స్కూటీని కొనుగోలు చేయాలని కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాలలో ఈ ఆఫర్ అమలవుతుండగా మార్చి 11వ తేదీ వరకు ఈ ఆఫర్ అమలులో ఉండనుంది. సమీపంలోని హీరో షోరూమ్ ను సందర్శించడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

    Hero Motocorp

    Hero Motocorp

    మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ 125, ప్లెజర్ ప్లస్ స్కూటర్ల కొనుగోలుపై హీరో కంపెనీ ఈ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. కొత్త స్కూటర్ల కొనుగోలుపై హీరో కంపెనీ క్యాష్ బోనస్ ఆఫర్ ను కూడా అందిస్తుండటం గమనార్హం. అయితే మహిళలు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. మహిళ పేరు మీద స్కూటీని బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా కొత్త స్కూటీని కొనుగోలు చేస్తే 4,000 రూపాయల 6,000 రూపాయల డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది.

    Also Read: బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీలో 91142 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్

    ఈ స్కూటీల ధరలు రూ.66,820 నుంచి రూ.73,450 వరకు ఉండటం గమనార్హం. ధరతో పాటు మెయింటెన్స్‌ ఖర్చు కూడా తక్కువగా ఉండటం వల్ల కొత్త స్కూటీని కొనుగోలు చేయడానికి ఈ స్కూటీలు బెస్ట్ అని చెప్పవచ్చు. హీరో కంపెనీ స్ప్లెండర్ బైక్ కొరకు ఈవీ కన్వర్షన్ కిట్‌ ను విడుదల చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఆర్టీఓ ఆమోదం కూడా లభించడం గమనార్హం.

    సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు హీరో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

    Also Read: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరా?