Maruti Suzuki New Brezza: కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారులు అభివృద్ధిని మారుతూ ఉంటాయి. వీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన.. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన కార్లు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఇదే సమయంలో కాంట్రాక్టు, సెడాన్ కార్ల కంటే SUV వేరియంట్లను ఎక్కువగా కొనాలని చూస్తారు. ఇప్పటికే మార్కెట్లో ఈ విభాగంలో మారుతి సుజుకి Brezza కారుతో అలరించింది. అయితే 2026 సంవత్సరంలో దీనిని ఆధునీకరించి విడుదల చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా కొత్తగా దీనిని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఆన్లైన్లో ప్రదర్శింపబడ్డాయి. ఆ వివరాల ప్రకారం కొత్తగా రాబోయే మారుతి సుజుకి Brezza ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
SUV విభాగంలో రాబోతున్న 2026 brezza ఎక్స్టీరియర్ డిజైన్ ఆకట్టుకొని ఉంది. దీనికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. ఇవి DRL తో పని చేయనున్నాయి. ఈ లైట్లతో బ్రేజ్జా ప్రీమియం కార్ల వలె అనిపిస్తుంది. అలాగే ఇందులో స్టైలిష్ గా ఉండే వీల్స్ ను మార్చారు. గతంలో కంటే ఇప్పుడు బంపర్స్ తో పాటు బాడీ షేప్ కూడా కొత్తగా ఉండనుంది. ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే తో రైడింగుకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ స్క్రీన్స్ గతంలో కంటే ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. క్యాబిన్ కెపాసిటీ పెరగడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా డోర్ పాడ్స్ ప్రీమియం లుక్ ను అందిస్తాయి. అలాగే సీటింగ్ సౌకర్యం కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇందులో ఫేస్ లిఫ్ట్ మోడల్ లో ఉండే ఫీచర్స్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అంటున్నారు. ఇందులో లెవెల్ 2 ADAS టెక్నాలజీని అమర్చారు. డ్రైవర్ ఎంత వర్క్ లో ఉన్న కూడా సులభంగా ప్రయాణించే విధంగా పనిచేస్తుంది.
ఈ కారులో 1.5 లీటర్ కె 15 సి స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది పై స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తుంది. ఇంధనం పొదుపు చేయాలని అనుకునే వారికి ఇది సపోర్ట్ గా నిలుస్తుంది. అలాగే ఇందులో హైబ్రిడ్ వ్యవస్థ ఉండడంతో నగరంతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఇక ఇందులో CNG వీరి ఏంటి కూడా ఉండడంతో మైలేజ్ పరంగా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు.
మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా లో సేఫ్టీ ఫీచర్లకు కొదవలేదు. ఈ కారులో మొత్తం ఆరు హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ ఓల్డ్ అసిస్టెంట్, 360 డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ సూట్ ఉంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే టాటా నెక్సన్, హ్యుందాయ్ వేదిక, కియా సోనేట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వండి. ఈ ఏడాది లోనే మార్కెట్లోకి వచ్చే ఈ కారు రూ.8.90 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.