Honor Win Turbo: స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘ఆనర్’ (Honor).. మొబైల్ ప్రియుల కోసం మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఆనర్ సంస్థ తన సరికొత్త గేమింగ్ పెర్ఫార్మెన్స్ సిరీస్ అయిన ‘ఆనర్ విన్’ (Honor Win) లైనప్‌లో భాగంగా.. తాజాగా చైనాలో ‘ఆనర్ విన్ టర్బో’ (Honor Win Turbo) మోడల్‌ను అధికారికంగా టీజ్ చేసింది. స్పోర్టీ లుక్, కోణీయ అంచులతో కూడిన భారీ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ , వెనుక భాగంలో వెలిగిపోయే ‘Win’ బ్రాండింగ్‌తో ఈ ఫోన్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది. ఈ ఫోన్ గరించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆనర్ విన్ టర్బో స్మార్ట్‌ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందుతోంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ సంస్థకు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) లేదా దానికి సమానమైన హై-ఎండ్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకంగా ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్ (Active Cooling Fan) టెక్నాలజీని కూడా జోడిస్తున్నారు.
ఇందులో ఇది దాదాపు 185Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది గేమింగ్ విజువల్స్‌ను మరింత స్మూత్‌గా మారుస్తుంది. సాధారణంగా గేమింగ్ ఫోన్లలో కెమెరాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఆనర్ విన్ టర్బోలో కెమెరా విభాగంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ (50MP) ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ , సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్ యొక్క అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఆనర్ విన్ టర్బో మోడల్ భారీ బ్యాటరీ లైఫ్‌తో రానుంది. అంతేకాకుండా దీని తదుపరి వెర్షన్ అయిన ‘విన్ 2’ సిరీస్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
ధర విషయానికి వస్తే, ఆనర్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సిరీస్ ఇదివరకు విడుదలైన ఆనర్ విన్ బేస్ మోడల్ ధరల ఆధారంగా చూస్తే.. ఇది సుమారు చైనీస్ కరెన్సీ ప్రకారం 3,500 నుండి 4,000 యువాన్ల వరకు ఉండవచ్చు. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.45,000 నుంచి రూ. 52,000 మధ్య ఉండే ఫ్లాగ్‌షిప్ బడ్జెట్ పరిధిలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో ఈ ఫోన్ కోసం ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు బుకింగ్స్ (Pre-orders) కూడా ప్రారంభమయ్యాయి.
