Toyota Highlander: ఉమ్మడి కుటుంబం ఒకేసారి ప్రయాణం చేయాలని వారికి.. కార్యాలయ అవసరాలకు సౌకర్యవంతంగా ఉండాలనుకునే వారికి..SUV కార్లు బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. కొన్ని కంపెనీలు ఈ వేరియంట్ కారులను తీసుకురావడంలో అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. అలాంటి కంపెనీలో TOYOTA ఒకటి. ఈ కంపెనీ నుంచి 2026 కొత్త సంవత్సరం సందర్భంగా హై లాండర్ న్యూ మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. ఇది మిడ్ సైజ్ SUV తోపాటు హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉండడంతో చాలామంది దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అలాగే ప్రయాణానికి సౌకర్యవంతమైన క్యాబిన్, ఇతర ఫీచర్లు కూడా ఉండడంతో కొత్తగా కారు కొనాలని అనుకునేవారు సైతం దీని గురించి ఆలోచిస్తున్నారు. ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళితే..
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టయోటా హై లాండర్ 2026 డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. అందంగా తీర్చబడిన LED హెడ్ లాంప్స్.. వెనుక భాగంలో టెయిల్ లైట్స్ కూడా ఎల్ఈడి తో ఉండడంతో బ్యాక్ సైడ్ కారు అందంగా కనిపిస్తుంది. అలాగే బాడీ లైన్ వాలుగా ఉండి డైనమిక్ కారుగా ఉంటుంది. అల్లాయి వీల్స్ తో కార్ సేఫ్ మారిపోయింది. ఇంటీరియర్ లోను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. క్యాబిన్ లేఅవుట్ మొత్తం ఆకర్షణీయంగా ఉంటుంది. సీట్లు ఎర్గోనామిక్ గా రూపొందించారు. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లేందుకు లెగ్ స్థలాన్ని కూడా కంఫర్ట్గా ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో XLE, లిమిటెడ్ ప్లాటినం ట్రిమ్ ఉండడంతో పాటు సేఫ్టీ షూట్స్ కూడా ఉన్నాయి.
ఈ కొత్త కారులో స్పెసిఫికేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. డ్రైవ్ మోడ్ తో పాటు ఆడియో మల్టీమీడియా సిస్టం,ప్రిన్సిన్ ఇండియాలో అసెంబుల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఆన్ డిమాండ్ AWD , లేటెస్ట్ టెక్నాలజీ, ఆప్షనల్ లెదర్ సీట్స్ ప్రీమియం లుక్ ను అందిస్తాయి.
కొత్తగా SUV కారు కొనే వారితోపాటు.. ఇప్పటివరకు ఉన్న కారును మార్చుకోవాలని అనుకునే వారికి ఈ కొత్త హైలాండ్ అద్భుతంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇందులో హైబ్రిడ్ ఇంజన్ ను చేర్చారు పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉండడంతో నగరాల్లో, దూర ప్రయాణాలు చేసే సమయంలో అనుకూలంగా ఉండనుంది. అయితే ఈ కారు ధర స్వల్పంగా పెంచినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కారు రూ.10.95 లక్షల ప్రారంభ ధరతో విక్రయించారు. ఇది ఇప్పుడు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే ఇన్నోవా ఐ క్రాస్, ఫార్చునర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.