Best Cars in India: అప్పుడెప్పుడో ‘అంబాసిడర్’లో తిరిగిన మనం ఇప్పుడు ‘బెంజ్’ కార్లు వాడుతున్నాం. నాడు అంబాసిడరే చాలా గొప్ప. అదొక పెద్ద స్టేటస్ సింబల్. కానీ నేడు బెంజ్ లు.. అంతకుమించిన కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎన్నో అత్యాధునిక కార్లు మార్కెట్ లను ముంచెత్తుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన కార్లు దేశంలో దిగుమతి అవుతున్నాయి.
ఇప్పటికీ ఎన్నికార్లు వచ్చినా నాటి సీనియర్లు అంబాసిడర్ నే ఎక్కువగా ఇష్టపడుతారు. ఆ కారు అలా బండకు బండగా ఉండేది మరీ. నాడు ఏ ఫీచర్లు లేకున్నా అదో గొప్ప ఫీలింగ్ ను కలిగించేది. అంబాసిడర్ తో మొదలైన భారతీయ ఆటో పరిశ్రమను ఇప్పుడు మారుతి సుజుకీ ఏలేస్తోంది.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా కూడా లీక్ అవ్వబోతుందా??.. ఆందోళనలో మేకర్స్
హిందూస్తాన్ మోటార్స్ తయారు చేసిన ‘అంబాసిడర్’ భారతీయ ఆటోమేటివ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడైన ఉత్పత్తి అయిన కారుగా నిలిచింది. ఇక ఆ తర్వాత టాటా ప్రారంభించిన మొదటి 24 గంటల్లోనే ‘ఇండియా’ కారు లక్ష బుకింగ్ లను నమోదు చేసి అత్యంత డిమాండ్ వచ్చిన కారుగా నిలిచింది.
ఈ క్రమంలోనే భారత ఆటోరంగంలో అత్యంత పాపులర్ అయిన పది కార్లు.. అవి ఎప్పుడు విడుదలయ్యాయి.. వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
1. హిందూస్థాన్ మోటార్స్ ‘అంబాసిడర్’
భారతదేశంలో మొదట్లో అత్యంత పాపులర్, ఎక్కువమంది రాజకీయ నాయకులు, ప్రజలు వాడిన కారు అంబాసిడర్. రాజకీయ నేతలంతా ఈ కారునే చాలా రోజులు వాడారంటే అతిశయోక్తి కాదు. . అంబాసిడర్ దేశపు కారుగా నాడు మారింది. మన దేశం ఏకైక అత్యంత ప్రసిద్ధి చెందిన కారుగా మిగిలిపోతుంది. రోడ్ల రారాజుగా పిలువబడే అంబాసిడర్ భారతదేశపు మొట్టమొదటి డీజిల్ కారు. దాని ధృడమైన నిర్మాణానికి మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది.
2. ప్రీమియర్ పద్మిని
అంబాసిడర్ తర్వాత దేశంలో పాపులర్ అయిన కారు ప్రీమియర్ పద్మిని. వ్యావహారికంలో ‘ప్యాడ్’ లేదా ‘ఫియట్’ అని పిలుస్తారు, ప్రీమియర్ పద్మినికి 14వ శతాబ్దపు రాజపుత్ర యువరాణి పేరు పెట్టారు. కాంపాక్ట్ లుకింగ్ సెడాన్ అంబాసిడర్ కు బలమైన ప్రత్యర్థిగా నిలిచింది. రజనీకాంత్, మమ్ముట్టి మరియు అమీర్ ఖాన్‌తో సహా ఆ కాలంలోని అనేక ప్రముఖులు దీన్ని వాడారు. ఇతర ప్రముఖులు చాలా మంది ఈ కాంపాక్ట్ సెడాన్‌ను ఆ నాడు కలిగి ఉన్నారు.
3. మారుతి 800
దేశంలో అంబాసిడర్, పద్మిని తర్వాత అత్యంత పాపులర్, అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి 800. అంబాసిడర్ -పద్మిని వంటి వాటికి పోటీగా 1983 సంవత్సరంలో విడుదలైన ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ భారతదేశం కార్ల పరిశ్రమనే మార్చివేసింది. ఈ కారుకు చాలా డిమాండ్ వచ్చింది. ప్రజలు కొనడానికి ఎగబడ్డారు. మారుతి 800 భారతదేశంలో ఫ్రంట్ వీల్ లేఅవుట్‌ను కలిగి ఉన్న మొదటి భారతీయ కారు. కారు తన జీవితాంతం మార్కెట్‌లో తిరుగులేని నాయకుడిగా ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా ఉంది.
4. టాటా ఇండికా
దేశపు కంపెనీగా పేరు తెచ్చుకొని నమ్మకానికి మారుపేరుగా ఉన్న ‘టాటా’ కంపెనీ నుంచి వచ్చిన ‘ఇండికా’ కారు దేశంలో హాట్ కేకులా అమ్ముడైంది. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ ప్యాసింజర్ కారుగా నిలిచింది. టాటా ఇండికా ప్రారంభించిన మొదటి 24 గంటల్లోనే 1,00,000 బుకింగ్‌లతో దేశంలో ఒక సంచలనంగా మారింది. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా ఈ ప్రసిద్ధ కారుపై ఆసక్తికరంగా స్పందించారు “ఇండికా మారుతీ జెన్ కొలతలు, అంబాసిడర్ క్యాబిన్ పరిమాణం.. మారుతి 800 యొక్క ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.” నాడు ప్రకటించడంతో జనాల్లో డిమాండ్ ఏర్పడింది. టాటా ఇండికా టాటా మోటార్స్‌ను ఇండియన్ ఆటో పరిశ్రమలో నిలబెట్టింది. ప్యాసింజర్ కార్లలో పాపులర్ బ్రాండ్‌గా మారింది. ఇది భారతదేశానికి ‘కమింగ్ ఆఫ్ ఏజ్ కార్’గా మార్కెట్ లో పేరుపొందింది.
5. హ్యుండాయ్ సాంట్రో
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్ నుంచి విడుదలైన ‘సాంట్రో’ కారు ఇండియా మార్కెట్లో దూసుకుపోయింది. దీన్ని జనాలు ఎక్కువగా కొని అభిమానించారు. ‘భారతదేశపు బెస్ట్ ఫ్యామిలీ కారు’గా సాంట్రో పేరుపొందింది. ఇప్పటికీ అప్ గ్రేడెడ్ వెర్షన్ సాంట్రోను జనాలు కొంటూ దీన్ని ఎవర్ గ్రీన్ గా ఆదరిస్తున్నారు.
6. మారుతి ఓమిని
మారుతి ఓమినీ.. స్లైడింగ్ డోర్‌ల కారణంగా భారతీయ సినిమాలలో ప్రతి కిడ్నాపర్ ఈ కారునే వాడేవాడని.. ఇందులోనే కిడ్నాప్ లు చేసేశారని చూపించారు. ఇది కిడ్నాప్ కారుగానూ ప్రసిద్ధి చెందింది, మారుతి ఓమ్ని భారతీయ ఆటోమొబైల్స్ చరిత్రలో దేశ ప్రజల హృదయాలలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఓమ్నీని సాధారణంగా మారుతి ‘వాన్’ అని పిలుస్తారు. 35 సంవత్సరాల సుదీర్ఘకాలం ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఉంది.
ఇక ఈ టాప్ 6 కార్ల తర్వాత స్థానంలో మారుతి జిప్సీ దేశంలో పాపులర్ అయిన 7వ కారుగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా టాటా సఫారీ, టాటా సుమోలు అత్యంత పాపులర్ కార్లుగా నిలిచాయి. ఈ రెండు కార్లు టాటా నుంచే ఉత్పత్తి అయ్యి విశేష జనాదరణ పొందాయి.
ఇక 10వ స్థానంలో దేశానికే చెందిన మహీంద్రా స్కార్పియో కారు అత్యంత ప్రజాదరణ కారుగా నిలిచింది.
ఇక ఇవే కాకుండా భారత దేశంలో మహీంద్ర బొలెరో కూడా అత్యధిక వేగంతో సరుకురవాణా, ప్రజా రవాణాకు అమ్ముడైన కారుగా నిలిచింది. ఇక అత్యంత చిన్న కారుగా ‘టాటా నానో’ కూడా ప్రజాదరణ పొందింది.
Also Read:TRS Plenary: కేసీఆర్ సేఫ్ గేమ్… ప్రత్యర్థుల పేరెత్తని గులాబీ అధినేత