https://oktelugu.com/

Telegram App: వాట్సాప్ ను మించి టెలిగ్రామ్ ఎందుకు వాడుతున్నారు? అసలేంటి కారణం?

వాట్సాప్ కు బదులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్నారు. కొన్ని ఫీచర్స్ తో పాటు సౌకర్యాలు ఇందులో ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దీనికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇరు దేశాలు ఈ యాప్ ద్వారానే మెసేజ్ చేశాయని దురోవ్ తెలిపారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 17, 2024 / 02:44 PM IST

    Whats app vs Telegram

    Follow us on

    Telegram App: మెసేజ్ తో పాటు ఫైల్స్, ఫొటోలు, వీడియోలు ఈజీగా పంపించుకోవడానికి వాట్సాప్ ప్రధాన వేదికగా నిలుస్తోంది. నిత్యం కోట్లాది మంది యూజర్స్ ఇందులో ఆన్ లైన్ లో ఉంటూ తమ కార్యకలపాలను నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రతీ వ్యవస్థకు ఓ ప్రత్యామ్నాయం వచ్చినట్లు.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ‘టెలిగ్రామ్’ యాప్ దూసుకుపోతుంది. ఇటీవల దీని యూజర్స్ విపరీతంగా పెరిగారు. ప్రస్తుతం 90 కోట్ల మంది వినియోగదారులు యాక్టివ్ గా ఉన్నారని, త్వరలో ఇది 100 కోట్లకు చేరుకుంటుందని దీని వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చెప్పారు. ఇటీవల ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే టెలిగ్రామ్ యాప్ ఎప్పుడు ప్రారంభమైంది? భారత్ లో దాని పరిస్థితి ఏంటి?

    వాట్సాప్ కు బదులు టెలిగ్రామ్ యాప్ ను వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్నారు. కొన్ని ఫీచర్స్ తో పాటు సౌకర్యాలు ఇందులో ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దీనికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇరు దేశాలు ఈ యాప్ ద్వారానే మెసేజ్ చేశాయని దురోవ్ తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ను 2013 ఆగస్టు 14న పావెల్ దురోవ్ రష్యాలో విడుదల చేశారు. అయితే 2014లో ఇందులో ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడంతో… దీనిని నిరసిస్తూ పావెల్ దురేవ్ ఆ దేశం నుంచి బయటకు వచ్చారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇరు దేశాలు ఈ యాప్ ఎక్కువగా వినియోగించడంతో దీనిని ఆదరణ పెరిగింది. అంతేకాకుండా ఇందులో మెసేజ్ తో పాటు సినిమాలు, పెద్ద పెద్ద వీడియోలు సైతం సెండింగ్, డౌన్లోడ్ కు సులభంగా అవకాశం ఉండడంతో దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని 1 బిలియన్ కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఈ యాప్ పై విమర్శలు లేకపోలేదు. ఇందులో తప్పుడు సమాచారం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

    భారత్ లో టెలిగ్రామ్ యాప్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దేశంలో మెసేజింగ్ యాప్ లో రెండో అతిపెద్ద నెట్ వర్క్ గా ఉంది. రష్యా, ఇండోనేషియా తరువాత ఈ యాప్ ను ఆదరించిన దేశం ఇండియానే. అయితే ప్రస్తుతం దుబాయ్ లో టెలిగ్రామ్ యూజర్స్ రోజూరోజుకు పెరుగుతున్నట్లు పావెల్ దురోవ్ తెలిపారు. వాట్సాప్ కంటే టెలిగ్రామ్ యూజర్స్ 200 కోట్లకంటే ఎక్కువగా నెలవారీ యూజర్స్ ఉన్నారని, త్వరలోనే అతిపెద్ద నెట్ వర్క్ స్థానానికి చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.