Telecom Tariff Hike: రోజులు పెరుగుతున్న కొద్ది ఇంటర్నెట్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అతి తక్కువ ధరకే అన్లిమిటెడ్ డేటాను పొందిన వినియోగదారులు రానున్న రోజుల్లో ఎక్కువ ధర పెట్టి డేటాను వినియోగించే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు టెలికాం నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల కింద ఉన్న టెలికాం ధరలకంటే ఇప్పుడు ఎక్కువగా పెరిగాయి. ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన ప్లాన్లను రద్దు చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read: భారత టెలికం రంగంలో కొలువుల జాతర.. ఫ్రెషర్లకు అపూర్వ అవకాశాలు!
జియో మార్కెట్లోకి వచ్చినా కొత్తలో అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో చాలామంది ఇతర నెట్వర్క్ ఉన్నవారు జియో కి మారి తక్కువ ధరకే రీఛార్జ్ ను పొందారు. అయితే కొందరు ఎయిర్టెల్ నెట్వర్క్ ను కూడా వాడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నెట్వర్క్ లు అన్ని తగ్గిపోయి జియో, ఎయిర్టెల్ మధ్య పోటాపోటీ నెలకొంది. ధరలు సైతం ఈ రెండు నెట్వర్క్ లు సమానంగా పెంచుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక నెట్వర్క్ ధరలు పెంచితే.. మరో నెట్వర్క్ వినియోగదారులు మారేవారు. కానీ ఇప్పుడు సంస్థలు అన్నీ కలిసి ఒకేసారి ధరలు పెంచుతున్నాయి .
వచ్చే ఆరు నెలల్లో ఈ రెండు నెట్వర్క్ ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని టెలికాం నిపుణులు తెలుపుతున్నారు. అయితే తాజాగా ఈ రెండు సంస్థలకు చెందిన ముఖ్యమైన రీఛార్జ్ ప్లాన్లను రద్దు చేశారు. జియో లో రూ. 209 రీఛార్జ్ ను రద్దు చేసింది. ఈ అమౌంట్ తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక జిబి డేటా వచ్చేది. ఇలా 22 రోజులపాటు గడువు ఉండేది. అలాగే రూ.249 రీఛార్జ్ ప్లాన్ కూడా రద్దు చేసింది. దీనిని రీచార్జ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక జీబీ డేటా తో 28 రోజులపాటు వ్యాలిడిటీ ఉండేది. అయితే వీటి స్థానంలో ప్రస్తుతం రూ. 299 చేర్చింది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 1.5 జిబి తో 28 రోజుల గడువు ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు వినియోగదారులు దాదాపు 50 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. గడువు తేదీ అలాగే ఉన్నా.. 500 ఎంబి డేటాను పెంచారు.
Also Read: టెలికాం కంపెనీల మధ్య పోరు 2025లో మళ్లీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?
ఎయిర్టెల్ సంస్థ కూడా రూ.299 ప్లాన్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ ఉన్నవారు దీనినే రీఛార్జ్ చేసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలు మరో ఆరు నెలల్లో పెరిగే అవకాశం ఉందని టెలికాం నిపుణులు తెలుపుతున్నారు.