https://oktelugu.com/

World Telugu IT Meet : తొలిసారి తెలుగు ఐటీ మహాసభలు.. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ లే చీఫ్ గెస్టులు

ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథులుగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడాబ్ సీఈవో శాంతను నారాయణ్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2023 / 08:58 PM IST
    Follow us on

    World Telugu IT Meet : సింగపూర్ వేదికగా ఆగస్టులో తొలిసారిగా తెలుగు ఐటీ మహాసభలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సభలకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పని చేస్తున్న తెలుగు టెక్నోక్రాట్స్ పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇప్పటి వరకు రంగంలో పనిచేస్తున్న తెలుగువారి సదస్సును నిర్వహించలేదు. తొలిసారి నిర్వహిస్తుండడంతో ఈ సదస్సు సర్వత్ర ఆసక్తి నెలకొంది. పోతే ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా తెలుగు తేజాలు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడాబ్ సీఈవో శాంతను నారాయేన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు. దీంతో ఈ సదస్సు పట్ల మరింత ఆసక్తి పెరిగింది.

    ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగువారు స్థిరపడ్డారు. వివిధ రంగాల్లో వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ రంగంలో వైద్య రంగంలోనే ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాలకు సంబంధించిన తెలుగువారి సదస్సులను నిర్వహిస్తూ వస్తున్నారు. తొలిసారి సింగపూర్ లో ఆగస్టు 5, 6 తేదీల్లో ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

    ముఖ్య అతిథులుగా హాజరవుతున్న దిగ్గజాలు..

    ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథులుగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడాబ్ సీఈవో శాంతను నారాయణ్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సదస్సులకు దాదాపు 100కు పైగా దేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్ లు, టెక్నో క్రాట్స్ హాజరు కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో, స్వదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఐటీ రంగ నిపుణులు, స్టార్టప్ లను ఏకతాటి పైకి తీసుకువచ్చేందుకు వరల్డ్ తెలంగాణ ఐటీ కౌన్సిల్ సందీప్ కుమార్ ముక్తాల నాయకత్వంలో ఏర్పడింది. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఆయన అమెరికా, కెనడా, మెక్సికో, మలేషియా, సింగపూర్, యూఏఈ దేశాల్లో పర్యటించి ఆయా వర్గాలతో సమావేశమయ్యారు. దీంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమకు చెందిన తెలుగు ఐటి రంగ ప్రముఖులను సమావేశపరిచే ఉద్దేశంతో ఈ సదస్సును తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు.

    బహిరంగ లేఖ రాసిన తెలంగాణ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్..

    ఈ సదస్సులో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇతర అంశాలను వివరిస్తూ తెలంగాణ ముఖ్య కార్యదర్శి రంజన్ బహిరంగ లేఖ రాశారు. సింగపూర్ వేదికగా జరిగే ఐటీ మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. తాను కూడా ఈ సదస్సులో పాలుపంచుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సదస్సులో వివిధ అంశాలకు సంబంధించిన అభిప్రాయాల వ్యక్తీకరణ, మెరుగైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటి అంశాలను ఇందులో చర్చించనున్నట్లు ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశాన్ని ఎందుకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.