Ratan Tata: భారత వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ సంస్థల గౌరవ అధ్యక్షుడు, దాతృత్వానిని మార్గదర్శి అయిన రతన్ టాటా బుధవారం రా6తి ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా వారం క్రితంమే ఆస్పత్రిలో చేరిన ఆయన తన ఆరోగ్యంపై వదంతుల వస్తున్న సందర్భంగా సోమవారం ఆయనే స్వయంగా స్పందించారు. నిరాధారమైన ప్రచారమని పేర్కొన్నారు. ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వ ఇలువలతోకూడిన వ్యాపారం చేసే ఆయన.. తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారంపైనా సున్నితంగా స్పందించారు. ఎవరినీ నిందించకుండా.. ఎవరినీ నొప్పించకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చివరి ట్వీట్ ఇలా…
‘నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో రతన్‌టాటా స్పందించారు. ‘ నా ఆరోగ్యం గురించి కొన్ని పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఇవన్నీ నిరాధారమైనవి అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వయసు సంబంధిత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను నేను ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నాను’ అని పేర్కొన్నారు.
ట్వీట్ చేసిన రెండు రోజులకే..
తాను ఉల్లాసంగా ఉన్నాను.. ఎలాంటి ఇబ్బంది లేదు.. ఆందోళన చెందకండి అని పోస్టు చేసిన రెండు రోజులకే పారిశ్రామిక దిగ్గసం దివిగెగిశాడు. ఆనారోగ్యంతో బుధవారం రాత్రే కన్ను మూశాడు. చివరి ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై అందరూ స్పందిస్తున్నారు.