Tata Sumo Re-Entry: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం విహార యాత్రలకు వెళ్లాలంటే Tata Sumo వాహనాన్ని ప్రిఫర్ చేసేవారు. దీంతో 1994 నుంచి సుమో ప్రభంజనాన్ని సృష్టించింది. ఆ తరువాత కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడంతో దీనిని పట్టించుకునేవారు కరువయ్యారు. అయితే ఇప్పుడు Tata Sumo అప్ గ్రేడ్ తో తిరిగి వస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పాటు నేటి వినియోగదారులకు అనుగుణంగా ఉండే విధంగా ఫీచర్లను మార్చుకున్న ఈ వెహికల్ 7 సీటర్ తో పాటు అతి ఎక్కువ మైలేజ్ ఇచ్చే విధంగా డిజైన్ చేశారు. అయితే ఇప్పటికే ఈ వాహనం గురించి ఆన్ లైన్లో సమాచారం ఉండడంతో చాలా మది పూర్వ టాటా సుమో ప్రియులు కొత్త వెహికల్ గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుందంటే?
టాటా సుమో 2025 పేరుతో మార్కెట్లోకి రాబోతున్న వాహనం ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆన్ లైన్ లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వెహికల్ బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ ను కలిగి ఉంటుంది. ఎల్ఈడీ ల్యాంప్ లు, పగలు సైతం ఆన్ అయ్యే లైట్స్ అమర్చారు. పూర్తిగా రిష్రెస్ రేట్ తో డిజైన్ చేయబడిన ఈ వెహికల్ క్లాసిక్ సుమో DNAను పోలీ ఉండే అవకాశాలున్నాయి. ఇందులో మునపటిలాగే 7 సీటర్ ను అమర్చారు. అయితే గతంలో కంటే ఇప్పుడు క్యాబిన్ విశాలంగా ఉండనుంది. సాప్ట్ టచ్ మెటీరియల్స్ తో పాటు కొత్త అప్హోల్సరీతో ఉండడంతో ఉమ్మడి కుటుంబం ఇందులో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే మెరుగైన క్యాబిన్ ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్తగా వచ్చే టాటా సుమో మైలేజ్ విషయంలో రారాజు అనిపించుకోనుంది. ఇది లీటర్ ఇంధనానికి 45 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెరుగైన ఏరోడైనమిక్స్, ఆప్టిమైజ్ చేయబడిన టర్బో ఇంజిన్ ఉండడంతో రోజూవారీ ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఇంధనం ఆదా అయ్యే అవకాశాలున్నాయి.
కొత్త టాటా సుమోలో ఫీచర్స్ ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన బిగ్ టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. లైవ్ డ్రైవింగ్ డేటాను ప్రదర్శించే డిజిటల్ మీటర్, వైర్ లెస్ ఛార్జింగ్, బహుళ యూఎస్ బీ ఫోర్ట్ లు, ఏసీ వెంట్లను అమర్చారు. అలాగే వాయిస్ టెక్నాలజీని కూడా ఇందులో అమర్చారు. సేప్టీ విషయంలో ఇది తగ్గకుండా ఉంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ తో కూడిన ఏబీఎస్ వెనుక పార్కింగ్ సెన్సార్లు, హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. SUV కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. గ్రామీణ రోడ్లపై సైతం సులభంగా వెళ్లగలిగే విధంగా టైర్లు ఉండడంతో అన్ని వర్గాల వారికి ఇది నచ్చుతుందని అంటున్నారు. దీని ధర అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ రూ.4.49 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.