TATA Punch EV: ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో దూసుకుపోతున్న భారతీయ మోటార్ సంస్థ టాటా.. 2026లో కొత్త వాహనాల లాంచింగ్‌లో దూసుకుపోతోంది. మార్కెట్లో మేజర్ షేర్ ఉన్న టాటా.. ఎలక్ట్రానిక్ కార్లను ప్రోత్సహిస్తోంది. కస్టమర్లకు నచ్చేలా కొత్త మోడల్స్ తెస్తోంది. తాజాగా పంచ్ ఈవీలో బాడీ డిజైన్‌ను ప్రీమియం రంగులో మార్చింది. మునుపటి బ్లాక్ స్ట్రిప్ తొలగించి, క్లీన్ లుక్ ఇచ్చారు. సన్‌లైట్ యెల్లో కలర్, అధునాతన అలయ్ వీల్స్‌తో రోడ్‌పై హైలైట్ అవుతుంది. ఈ మార్పులు మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షిస్తాయి.
అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు
పంచ్ ఈవీలో 12.3–ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సెంటర్‌తో కనెక్టెడ్ టెక్ అందుబాటు. 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ సులభం చేస్తుంది. వైర్లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్‌తో లగ్జరీ ఫీల్. ఈ ఫీచర్లు పోటీదారుల్లో బెస్ట్‌గా నిలబెడతాయి.
డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్లు..
25 kWh బ్యాటరీతో 265 కి.మీ., 35 kWh 365 కి.మీ. రేంజ్ అందిస్తుంది. నగర ప్రయాణాలకు సరిపోతాయి. ఛార్జింగ్ సమయం, బ్యాటరీ లైఫ్ మెరుగుపడి, రోజువారీ ఉపయోగానికి అనుకూలం. ఈవీ మార్కెట్లో ధర–రేంజ్ బ్యాలెన్స్ బలం.
ధర ఎంతంటే..
ఎక్స్–షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల వరకు ఉంటుంది. ఈనెల 20వ తేదీ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మధ్య తరగతి వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్. వారిని దృషిటలో పెట్టుకుని టాటా ఈ ఈవీని అందుబాటోలోకి తెస్తుంది. పోటీ మోడళ్లతో పోల్చి, ఫీచర్లు, ధరలు అడ్వాంటేజ్ తెలుసుకుని నిపుణుల సలహా తీసుకోవాలి.
ఈ మోడల్ టాటా ఈవీ డామినెన్స్‌ను బలోపేతం చేస్తుంది. డిజైన్, టెక్, రేంజ్ మిక్స్‌తో మార్కెట్ షేర్ పెంచుతుంది. భారత ఈవీ రంగంలో బడ్జెట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.