TATA New Bike: చిన్న చిన్న అవసరాలకు, తక్కువ దూరం ప్రయాణాలు చేసే వారికి Two wheeler అనుకూలంగా ఉంటుంది. దీంతో కొంతమంది ప్రత్యేకంగా బైక్స్ కొనుగోలు చేస్తారు. అయితే రోజువారి అవసరాలతో పాటు కార్యాలయాల అవసరాలు తీర్చే బైక్ లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. వీరు తక్కువ ధరతో పాటు మైలేజ్ ఎక్కువ ఇచ్చే వాటికోసం సెర్చ్ చేస్తారు. ఇలాంటి వారికోసం Tata కంపెనీ కొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది తక్కువ ధరతో పాటు అత్యధిక మైలేజ్ ఇవ్వనుంది. అలాగే ఇప్పటి వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్స్ ను అమర్చారు. ఇంతకీ ఈ బైక్ ఏది? అది ఎలా ఉందంటే?
Tata కంపెనీ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన కొత్త బైక్ టూ వీలర్ వేరియంట్లలో సంచలనం సృష్టించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మధ్యతరగతి ప్రజలు రోజువారి ప్రయాణం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీని ధర కేవలం రూ.45,999 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఎటువంటి బైక్ కొనుగోలు చేయాలన్నా.. లక్ష రూపాయల పై మాటే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంత తక్కువ ధరలో బైక్ రావడం రోజువారి అవసరాలకు సపోర్టు ఇచ్చినట్లే అని అంటున్నారు. ఇది తక్కువ ధర అయినప్పటికీ ఇందులో 125 సిసి ఇంజన్ ను అమర్చారు. ఇది లీటర్ ఇంధనానికి 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సస్పెన్షన్ సెటప్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్ గా ఇది నిలుస్తుంది.
టాటా కొత్త బైక్ లో LED DRL హెడ్ లాంప్స్ ఉన్నాయి. అలాగే డిజిటల్ స్పీడోమీటర్, ప్రీమియం గ్రాఫిక్స్, అలాగే వీల్స్, సీట్ సెటప్ సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఎలాంటి అలసటకు గురికాకుండా ఉంటారు. ఇంజన్ సెట్ అప్ విషయానికి వస్తే ఎయిర్ కోల్డ్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేసే ఇది 9.5 బిహెచ్పి పవర్ను అందిస్తుంది. అలాగే 10 ఎన్ఎం టార్కులు రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ బైక్ సున్నితంగా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మెరుగైన పికప్ తో సౌకర్యవంతంగా ఉండరు ఉంది.
ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు లేనప్పటికీ ఈఎంఐ ద్వారా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈఎంఐ రూ.1,499 నుంచి ప్రారంభమై సామాన్యులకు అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ఐదు సంవత్సరాల ఇంజన్ వారంటీని ఇస్తున్నారు. అలాగే మూడు సంవత్సరాల ఫ్రీ సర్వీస్ కూడా ఇవ్వనున్నారు. తక్కువ ధరలో రోజువారి అవసరాల కోసం బైక్ కావాలని అనుకునే వారికి ఇది ఎంతో అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చే రోజుల్లో అత్యధికంగా విక్రయాలు జరుపుకునే బైక్ గా ఉండనుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.