Homeబిజినెస్Tata Punch on Discount: భారత మార్కెట్‌లో టాటా పంచ్ హవా.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన...

Tata Punch on Discount: భారత మార్కెట్‌లో టాటా పంచ్ హవా.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్!

Tata Punch on Discount: భారత మార్కెట్‌లో టాటా మోటార్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రాస్‌ఓవర్ SUVకి విపరీతమైన డిమాండ్ ఉండటంతో టాటా మోటార్స్ రూ.25,000 వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. టాటా పంచ్‌కి ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. డిస్కౌంట్ వివరాల కోసం టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టాటా పంచ్
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో 40 ఏళ్ల నుంచి మారుతి సుజుకీ కార్లునే అత్యధికంగా అమ్ముడయ్యేవి. అయితే, 2024లో ఈ రికార్డును టాటా పంచ్ బద్దలు కొట్టింది. 2024లో 2.2 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడవ్వడంతో ఈ కారే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది!

టాటా పంచ్ ధర & ఇంజిన్ పవర్
* ధర (ఎక్స్-షోరూమ్, ఇండియా): రూ.6.12 లక్షల నుంచి ప్రారంభం
* ఇంజిన్: 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్
* పవర్: 87.8 PS వద్ద 6700 rpm
* టార్క్: 115 Nm వద్ద 3150-3350 rpm
* ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా లభ్యం.

టాటా పంచ్ మైలేజ్ (ARAI సర్టిఫైడ్)
* పెట్రోల్ మాన్యువల్: 20.09 kmpl
* పెట్రోల్ ఆటోమేటిక్: 18.8 kmpl
* CNG వెర్షన్: 26.99 km/kg

టాటా పంచ్ టాప్ ఫీచర్లు
* ఎలక్ట్రిక్ సన్రూఫ్
* 26.03 cm టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* వైర్లెస్ ఫోన్ చార్జింగ్
* గ్లోబల్ NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

ఫైనల్ వర్డిక్ట్
* టా పంచ్ 2024లో భారత మార్కెట్‌ను షేక్ చేసింది!
* ₹25,000 డిస్కౌంట్‌తో ఇది కొనుగోలుదారులకు మరో మంచి అవకాశంగా మారింది.
* SUV లుక్, అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ సేఫ్టీ వల్ల మహీంద్రా KUV100 NXT, మారుతి ఇగ్నిస్ లాంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version