Tata Curvv EV : దేశంలో నంబర్ వన్ ఎస్యూవీగా వెలుగొందుతున్న హ్యుందాయ్ క్రెటాను కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ అవతార్ లో కూడా రిలీజ్ చేసింది. అయితే, ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు దీనికి గట్టి పోటీనిస్తున్నాయి. వాటిలో టాటా కర్వ్ ఈవీ ఒకటి. ప్రస్తుతం ఈ కారుపై ఏకంగా రూ. 1.7 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. అంతేకాదు, టాటా మోటార్స్ తమ ఇతర ఎలక్ట్రిక్ కార్లపై కూడా మే నెలలో భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
టాటా మోటార్స్ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా కర్వ్ ఈవీపై మే నెలలో గరిష్టంగా రూ. 1.7 లక్షల వరకు బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ 2024 మోడల్‌పై మాత్రమే వర్తిస్తుంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 90,000 వరకు స్క్రాపేజ్ బోనస్,రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. ఒకవేళ మీరు 2025 మోడల్‌ను ఎంచుకుంటే కేవలం రూ. 50,000 లాయల్టీ బోనస్ మాత్రమే లభిస్తుంది.
Also Read : టాటా నుంచి కొత్త ఎస్ యూవీ కూపే కారు..నేడు మార్కెట్లోకి.. SUV కూపే అంటే?
టాటా మోటార్స్ అతి చిన్న ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీని కొనుగోలు చేయాలనుకుంటే మే నెలలో 2024 మోడల్‌పై రూ. 1.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే 2025 మోడల్‌పై రూ. 50,000 వరకు మాత్రమే తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ కలిసి ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు.
టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా నెక్సాన్. మే నెలలో దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌పై మీరు రూ. 1.4 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ 2024 మోడల్ కొనుగోలుపై వర్తిస్తుంది, అయితే 2025 మోడల్‌పై రూ. 50,000 లాయల్టీ బోనస్ మాత్రమే లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు. టాటా టియాగో ఈవీపై మే నెలలో 2024 మోడల్‌పై రూ. 1.3 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో 2025 మోడల్‌పై రూ. 50,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read : పెట్రోల్ ఖర్చులకు టాటా చెప్పేయండి..ఇప్పుడు కొంటే రూ.70వేల తగ్గింపు