https://oktelugu.com/

Personal Loan తీసుకునేవారికి అలర్ట్.. వచ్చే నెలలోపే తీసుకోండి!

ప్రస్తుతం ఉన్న 9 శాతం వడ్డీ రేటు 11 శాతానికి పెరుగుతుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డులు జారీ చేసే సమయంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2024 / 09:44 PM IST
    Follow us on

    Personal Loan : ఈమధ్య Personal Loan తీసుకోవడం చాలా తేలిక అయింది. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. మినిమం డాక్యుమెంట్స్ తో లక్ష రూపాయల వరకు రుణం ఇస్తున్నారు. అయితే ఇన్ టైంలో పే చేయకపోతే మాత్రం వడ్డీలతో బాదుతున్నారు. అయితే కొందరు అత్యవసరం నిమిత్తం లోన్ తీసుకొని దానిని చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తూ అధిక వడ్డీలు కడుతున్నారు. లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్ల గురించి ఆలోచిస్తే ఆ తరువాత ఎటువంటి సమస్య ఉండదు. ఫిబ్రవరిలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆ భారం పర్సనల్ లోన్ తీసుకునేవారిపై పడనుంది. ఇంతకీ ఎంత పెరుగుతుందంటే?

    డబ్బు అవసరం ఉన్నప్పుడు వేరొకరిని అడిగితే ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికైతే చాలా తక్కువే. అందుకే బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్ ను అందిస్తున్నాయి. వినియోగదారుల ట్రాన్జాక్షన్ బట్టి వారికి కావాల్సిన రుణాన్ని అందిస్తున్నాయి. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ప్రధానంగా వడ్డీ రేట్ల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లను బట్టి ఈఎంఐ ఎంత చెల్లించాలి అనేది డిసైడ్ అవుతుంది. కొన్ని బ్యాంకులు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లతో రుణాలు అందించి.. ఆ తరువాత వడ్డీ రేట్లు పెరగడం ద్వారా ఈఎంఐని పెంచుతాయి. మరికొన్ని అలా చేయవు. అయితే దాని కోసం ముందుగానే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

    చాలా మంది డబ్బులు అవసరం ఉండి పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటారు. అయితే సమయం వచ్చినప్పుడు తీసుకుందాం అని నిర్ణయించుకుంటారు. కానీ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు ముందే తీసుకోవడం మంచిది. 2024 ఫిబ్రవరిలో వడ్డీరేట్లు పెరగనున్నాయి. దీంతో లోన్ తీసుకునేవారిపై భారం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్రెడిట్ రిస్క్ ను 100 నుంచి 125 శాతం పెంచింది. దీంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NFBC)లు ఈ భారాన్ని వినియోగదారులపై వేయనున్నారు.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం NFBC లు ఫిబ్రవరి 29 నుంచి వడ్డీ రేట్లు పెంచనున్నాయి. రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు రుణం ఆధారంగా మూలధనంలో కొంత భాగాన్ని రిస్క్ భరించవలసి ఉంటుంది. అయితే ఇది వారు లోన్ తీసుకునేవారిపైనే మోపే అవకాశం ఉంది. దీనిని వడ్డీ రేట్ల రూపంలో వసూలు చేసే అవకాశం ఉంది. ఇది అమలైతే ప్రస్తుతం ఉన్న 9 శాతం వడ్డీ రేటు 11 శాతానికి పెరుగుతుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డులు జారీ చేసే సమయంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.