https://oktelugu.com/

Swiggy: హైదరాబాద్ లో ఉన్న వారికి అలర్ట్.. బిర్యానీ కేవలం రూ.79కే.. ఎక్కడ? ఎప్పటి నుంచి అంటే?

ప్రముక ఫుడ్ డెలివరీ కంపెనీ Swiggi గురించి దాదాపు తెలియని వారుండరు. ఆన్ లైన్ లో కావాల్సిన ఐటమ్ ఆర్డర్ చేస్తే అనుకున్న సమయానికి ఇంటికి తెచ్చి ఇస్తారు. తాజాగా స్విగ్గీ సేల్స్ ను పెంచడానికి భారీ ఆఫర్లు ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 30, 2024 / 12:19 PM IST

    Swiggy

    Follow us on

    Swiggy: హైదరాబాద్లో నివసించడం చాలా కాస్ల్టీ అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. పాల ధర నుంచి అద్దె, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. ఇక్కడున్న వారికి ఆదాయం ఎంత వస్తుందో.. అంతే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. అయితే ఆదాయాన్ని బేస్ చేసుకొని ఖర్చులు పెడుతూ ఉండాలి. కొన్ని ఖర్చులను మినహాయించుకుంటూ ఉండడం వల్ల డబ్బులు మిగులుతాయి. లేకుంటే వచ్చే ఆదాయం ఏ మూలాన సరిపోదు. అయితే ఇక్కడున్న వారికి రుచికరమైన ఆహారం, ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని అనుభవించాలని ఉంటుంది. కానీ సరైన ఆదాయం లేకపోవడంతో వెనుకడుగు వేస్తారు. అయితే ఒక్కోసారి ఇలాంటివి అనుభవించడానికి కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ఆఫర్లను చేజిక్కించుకుంటే తక్కువ ధరలోనే కాస్ట్లీ ఫుడ్ తినొచ్చు. వీకెండ్ డేస్, కొన్ని ప్రత్యేక రోజుల్లో ఫుడ్ బిజినెస్ చేసేవాళ్లు కొన్నిఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కానీ తాజాగా ప్రముఖ స్విగ్గీ కంపెనీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మాన్ సూన్ సందర్భంగా వీకెండ్ మంథ్ సేల్స్ ఉంటూ ‘క్రేజీ డీల్స్ ’ పేరుతో కొన్ని పదార్థాలపై ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ల ప్రకారం అత్యంత తక్కువ ధరలోనే రుచికరమైన ఫుడ్ ను కోనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. వీటిలో బిర్యానీతో పాటు ఐస్ క్రీం, బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మరీ ఈ ఆఫర్ దక్కాలంటే ఏం చేయాలి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది వరిస్తుంది?

    ప్రముక ఫుడ్ డెలివరీ కంపెనీ Swiggi గురించి దాదాపు తెలియని వారుండరు. ఆన్ లైన్ లో కావాల్సిన ఐటమ్ ఆర్డర్ చేస్తే అనుకున్న సమయానికి ఇంటికి తెచ్చి ఇస్తారు. తాజాగా స్విగ్గీ సేల్స్ ను పెంచడానికి భారీ ఆఫర్లు ప్రకటించింది. Crazy Deals పేరుతో ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇవి జూలై 30, 31 ఆగస్టు 4 అనే మూడు రోజులు ఉండనున్నాయి. అయితే ఇవి హైదరాబాద్ లో నివసించే వారికి మాత్రమే. ఇతర జిల్లాల గురించి ఇంకా ప్రకటన రాలేదు. అయితే త్వరలో వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ అలాంటి ప్రకటన వస్తే మాత్రం సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

    స్విగ్గీ ఇస్తున్న ఆఫర్లను పరిశీలిస్తే బిర్యాని కేవలం రూ. 79 మాత్రమే ఉంది. ఐస్ క్రీం రూ. 59 నుంచి విక్రయిస్తున్నారు. ఇక షవర్ మా అయితే రూ.89 నుంచి విక్రయించనున్నారు. హైదరాబాద్ లోని మొత్తం 5 వేల రెస్టారెంట్ల నుంచి ఫుడ్స్ ను తీసుకురానున్నారు. అయితే ఈ ఆపర్ వర్తించాలంటే స్విగ్గీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో ఆఫర్ కు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ మూడు రోజులు ప్రత్యేకంగా బయటి ఫుడ్ తినాలని భావించేవారు స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు.

    సాధారంగా ఇలాంటి ఆఫర్స్ వీకెండ్స్, పండుగ దినాల్లో ప్రకటిస్తారు. అయితే జూలై 30,31 మంథ్ ఎండింగ్ సందర్భగా ఈ ఆఫర్ ను ప్రకటించారు. అలాగే ఆగస్ఠు 4వ తేదీన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆరోజు ఇది వర్తించనుంది. అందువల్ హైదరాబాద్ లో నివసించేవారు ఈ ఆఫర్ ను పొంది కావాల్సిన ఫుడ్ ను తెప్పించుకోవచ్చు. అయితే ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించుకుంటున్నారో సంబంధిత దూరాన్ని బట్టి ప్రైస్ మారే అవకాశం ఉంది. అందువల్ల ముందే ప్రైస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత ఆర్డర్ చేయాలి. లేకుంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.