https://oktelugu.com/

Liquor Delivery: మందు బాబులకు కిక్కిచ్చే వార్త.. ఇక ఇంటికే మద్యం డెలివరీ.. స్విగ్గీ, జొమాటోతో ఒప్పందం?

స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి యాప్స్‌ త్వరలో బీర్, వైన్, లిక్కర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను హోమ్‌ డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ సంస్థలు కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఫుడ్‌ మాత్రమే డెలివరీ చేస్తున్నాయి. తర్వాత వ్యాపార విస్తరణలో భాగంగా కిరణా సరకులు, కూరగాయలు వంటికి కూడా సరఫరా చేస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 16, 2024 / 03:41 PM IST

    Liquor Delivery

    Follow us on

    Liquor Delivery: దేశంలో ఈకామర్స్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. రిటైల్‌ దుకాణాలు మూతపడుతన్నాయి. దీంతో అంతా ఆన్‌లైన్‌ మయమైంది. తినే ఆహారం నుంచి ఇంట్లో సరుకుల వరకు.. వేసుకునే దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రజల అవసరాలే పెట్టుబడిగా ఈ కామర్స్‌ సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పాయి.

    ఆల్కహాల్‌ డోర్‌ డెలివరీ..
    స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి యాప్స్‌ త్వరలో బీర్, వైన్, లిక్కర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను హోమ్‌ డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ సంస్థలు కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ఫుడ్‌ మాత్రమే డెలివరీ చేస్తున్నాయి. తర్వాత వ్యాపార విస్తరణలో భాగంగా కిరణా సరకులు, కూరగాయలు వంటికి కూడా సరఫరా చేస్తున్నాయి. తాజాగా ఓ అడుగు ముందుకేసి ఆల్కహాల్‌ కూడా డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

    ఆ రాష్ట్రాల్లో ముందుగా..
    మద్యం హోం డెలివరీని ముందుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు కర్ణాటక, హర్యాణ, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టే అవకాశం ఉంది. ఈమేరకు ఆయా ఈకామర్స్‌ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. దుకాణాలకు వచ్చి మద్యం కొనుగోలు చేయలేనివారి కోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

    కరోనా సమయంలో డోర్‌ డెలివరీ..
    2020లో కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అసోం రాష్ట్రాల్లో మద్యం డోర్‌ డెలివరీకి అనుమతి ఇచ్చారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. ఇక ఇప్పటికే మద్యం హోమ్‌ డెలివరీ అనుమతి ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం తీసుకురావడం వల్ల మద్యం అమ్మకాలు 20–30 శాతం పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇటు మద్యం తయారీ సంస్థలతోపాటు, ఇటు ఈకామర్స్‌ సమస్థలకు లాభం కలిగేలా మద్యం డోర్‌ డెలివరీకి కసరత్తు చేస్తున్నాయి.

    రాంఛీలో డోర్‌ డెలివరీ..
    2020లో స్విగ్గీ, జొమాటోల నాన్‌ మెట్రో ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ఆల్కహాల్‌ డెలివరీని ప్రారంభించాయి. జార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన స్విగ్గీ మద్యం డెలివరీ సేవను రాంచీలో ప్రారంభించింది. ఇప్పుడు జొమాటో కూడా ఈ సేవలను రాంచీలో ప్రారంభించింది. మరో ఏడు నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.

    అధికారులతో చర్చలు..
    మద్యం హోం డెలివరీ కోంస స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇటు అధికారులతో, అటు మద్యం కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా పెద్ద నగరాల్లో, మితమైన ఆల్కహాల్‌ కంటెంట్‌ స్పిరిట్లను భోజనంతోపాటు వినోద పానీయంగా భావించే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. సంప్రదాయ మద్యం దుకాణాలు, షాప్‌–ఫ్రంట్‌ అనుభవాల నుంచి కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడే మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు సైతం ఇది ఉపయోగపడుతుందని ఓ ఈ కామర్స్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు.

    చార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ..
    ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం సంస్థ జొమాటో సర్వీస్‌ చార్జీలను ఇటీవల పెంచింది. ఇప్పుడు స్వీగ్గీ కూడా అదే బాటలో ధరలు పెంచింది. దీంతో ఇప్పుడు ఫుడ్‌ ఆర్డర్‌ కూడా ఖరైంది. జొమాటో మొదట ఫ్లాట్‌ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది. ఆ తర్వాత స్విగ్గీ కూడా పెంచింది. రెండు కంపెనీలు కస్టమర్ల ఆర్డర్‌పై రూ.6 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తున్నాయి.