SUV sales higher than hatchback: దేశంలో అత్యధిక కార్ల విక్రయాల్లో Maruthi Suzuki ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. కొత్తగా హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని అనుకునేవారు ముందుగా మారుతి సుజుకీ కంపెనీ వైపు చూస్తుంటారు. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ వంటివి ఎంతో ప్రజాధరణ పొందాయి. అయితే గతంలో మిగతా కంపెనీలు SUVలు మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు మారుతి సుజుకీ కంపెనీ పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ ఆ తరువాత మిడిల్ ఎస్ యూవీ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని రకాల కార్లను పరిచయం చేశారు. ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ కంటే SUV కార్లనే ఎక్కువగా విక్రయించే స్థాయికి ఎదిగింది. కొన్ని నివేదికల ప్రకారం ప్రస్తుతం మారుతి సుజుకీ హ్యాచ్ బ్యాక్ కంటే ఎస్ యూవీల కార్లు ఎక్కువగా విక్రయించే కంపెనీ అని పేర్కొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Society Of Indian Automobile Manufacturers(SIAM)నివేదిక ప్రకారం 2026 ఏడాదిలో 11 నెలల్లో మారుతి సుజుకీ కంపెనీ 6,89,631 కార్ల అమ్మకాలు చేసింది. ఇవి మొత్తం SUVకార్లు కావడం విశేషం. గత ఏడాది ఈ సెగ్మెంట్ లో 6,28,958 యూనిట్లు ఉన్నాయి. అంటే ఏడాదిలో ఈ వేరియంట్ అమ్మకాలు 60,673 యూనిట్లు పెరిగాయి.
రెండేళ్ల కిందట అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లుమాత్రమే ఎక్కువగా విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ఏడాదిలో హ్యాచ్ బ్యాక్ లు 8,05,593 ఉన్నాయి. UV సెగ్మెంట్లు 6,42,296 ఉన్నాయి. అంటే యూవీల కంటే హ్యాచ్ బ్యాక్ కార్లు 11,302 యూనిట్లు ఉన్నాయి. కానీ 2025 ఏడాదిలో హ్యాచ్ బ్యాక్ లు 7,31,486 ఉంటే.. యూవీలు 7,20,184కు చేరాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.
కానీ 2026లో మాత్రం అత్యధికంగా సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది. వినియోగదారుల అభిరుచులు కాలాన్ని భట్టి మారుతున్నాయి. విశాలమైన కారుతో పాటు ఇందులో ఉండే ఇంజిన్ పనితీరులో ఎన్నో మార్పులు ఉండడంతో చాలా మంది ఈ సెగ్మెంట్ కార్లను కోరుకుంటున్నారు. అంతేకాకుండా మారుతి సుజుకీ కంపెనీకి చెందిన ఈ వేరియంట్ కార్లు తక్కువ ధరలో ఉండడం మరో కారణంగా ఉంది.
2026లో మారుతి సుజుకీ కంపెనీకి చెందిన బ్రెజ్జా ఫేస్ లిప్ట్ తో పాటు ఫ్రాంక్స్ హైబ్రిడ్ కార్లు ఈ పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఇవి 2023లో మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఇటీవల వీటి పెరుగుదల ఉండడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అలాగే బాలెనో వేరియంట్ కూడా ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాప్ లెవల్లో ఉంది.