https://oktelugu.com/

SUV Cars Under 6 Lakhs: రూ.6 లక్షల్లో SUV కారు.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు..

దేశీయ కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ కంపెనీ పోటీ పడుతుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు రోడ్లపై తిరుగుతూ ఆకట్టుకుంటన్నాయి. హ్యుందాయ్ ఎక్కువగా ఎస్ యూవీలపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా మైక్రో ఎస్ యూవీ ఎక్స్ టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 22, 2023 / 04:36 PM IST

    SUV Cars Under 6 Lakhs

    Follow us on

    SUV Cars Under 6 Lakhs కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారుల అభిప్రాయాలు మారుతున్నాయి. మొన్నటి వరకు సింప్లీగా.. సాదా సీదా కారు కొనాలని అనుకునేవారు.కానీ ఇప్పుడు హైఫై రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు. భారీ ఇంజిన్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీల ఉత్పత్తిలపైనే ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ ఉత్పత్తి చేసిన ఎస్ యూవీ కారు కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. ఆ కారు వివరాల్లోకి వెళితే..

    దేశీయ కార్ల ఉత్పత్తిలో హ్యుందాయ్ కంపెనీ పోటీ పడుతుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు రోడ్లపై తిరుగుతూ ఆకట్టుకుంటన్నాయి. హ్యుందాయ్ ఎక్కువగా ఎస్ యూవీలపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా మైక్రో ఎస్ యూవీ ఎక్స్ టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రిలీజ్ అయిన 5 నెలల్లోనే విపరీతమైన స్పందన వచ్చింది. ఈ ఆరు నెలల్లో ఏకంగా లక్ష బుకింగ్లు అవగా.. 31, 174 కార్లు అమ్ముడు పోవడం విశేషం. ఇందులో మైక్రో ఎస్ యూవీ ఎక్స్ టర్ ప్రారంభించిన నెలలోనే 7,000 యూనిట్లు అమ్ముడు పోయాయి. ఆగస్టులు, 7,430, సెప్టెంబర్ లో 8,6 47 యూనిట్లు అక్టోబర్ లో 8,097 ఉత్పత్తులు విక్రయాలుజరుపుకుంది.

    ఈ మోడల్ వివరాల్లోకి వెళితే 1.2 లీటర్, 4 సిలిండర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే 83 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఎంపికను కలిగి ఉంది. సీఎన్ జీ విషయానికొస్తే 69 బీహెచ్ పీ పవర్ ను , 95.2 ఎన్ ఎం పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. ఏంటీ గేర్ బాక్స్, మిడ్ స్పెక్ ఎస్ ట్రిమ్ లతో అందుబాటులో ఉంది. దీని ఇంజిన్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

    మైక్రో ఎస్ యూవీ 700 నుంచి రూ. 6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఆన్ రోడ్ రూ.9.32 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఏఎంటీ వేరియంట్ల ధర రూ.7.97 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అమ్ముతున్నారు. ఇది సీఎన్ జీతో పాటు ఎస్,ఎస్ ఎక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎస్ యూవీల కోసం ఎదురుచూస్తున్న వారికి మైక్రో ఎస్ యూవీ 700 ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు కావాలనుకునేవారికీ ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.