Post Office Scheme: ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 14 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు, రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్‌సీఎస్‌ఎస్‌లో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే అకౌంట్ ను తెరిచే ఛాన్స్ ఉంటుంది. కనీసం 1,000 రూపాయలతో ఈ అకౌంట్ ను తెరవవచ్చు. ఈ స్కీమ్ లో మొత్తం 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి 14,28,964 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
Also Read: వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డు, పాస్ పోర్ట్ ఏమౌతాయో తెలుసా?
ఈ స్కీమ్ లో గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు అయినా మరో మూడు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ను పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. 1,000 రూపాయల నుంచి లక్ష రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉండగా వడ్డీరేటు విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.
సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ లో ఈ చిన్న రంధ్రాన్ని ఎప్పుడైనా గమనించారా..ఆ రంధ్రం ఎందుకుందో తెలుసా?