https://oktelugu.com/

Subbamma Jasti: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో భారతీయ వృద్ధ మహిళ.. సంపద ఎంతో తెలుసా?

సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సుబ్బమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు 1970, 1980 లలో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్‌ నడిపేవాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 13, 2024 / 08:14 AM IST

    Subbamma Jasti

    Follow us on

    Subbamma Jasti: ఫోర్బ్స్‌ సంస్థ.. కేటగిరీల వారీగా ఏటా జాబితాలు విడుదల చేస్తుంది. ఏ కేటగిరీలో అయినా ఆ జాబితాలో స్థానం దక్కడాన్ని గొప్పగా ఫీల్‌ అవుతారు. తాజాగా బిలియనీర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో భారతీయ వృద్ధ మహిళా బిలియనీర్‌ సుబ్బమ్మ జాస్తికి స్థానం దక్కింది. ఆమె నికర సంపద 1.1 బిలియన్‌ డాలర్ల(రూ.91.9 వేల కోట్లు)కు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కింది.

    ఎవరీ సుబ్బమ్మ..
    సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సుబ్బమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు 1970, 1980 లలో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్‌ నడిపేవాడు. ఫోర్బ్స్‌ ప్రకారం 2022లో సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడెట్‌ ఇంటర్నేషనల్‌కు వాటా విక్రయించింది. దీంతో సుబ్బమ్మకు అతిపెద్ద భాగం వచ్చింది.

    భర్త ఆస్తి కూడా ఆమెకే..
    ఇక సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గతేడాది ఫిబ్రవరిలో మరణించాడు. దీంతో అతని ఆస్తి కూడా సుబ్బమ్మ పొందారు. దీంతో ప్రపంచంలోని ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. ఈ జాబితాలో 2,653 స్థానంలో సుబ్బమ్మ ఉన్నారు.

    మొదటి స్థానంలో సావిత్రి జిందాల్‌..
    ఇక ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా విషయానికి వస్తే సావిత్రి జిందాల్‌ 34.9 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈమే భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. సావిత్రి జిందాల్‌ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.