
భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడతారనే సంగతి విదితమే. మహిళలు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు. బంగారాన్ని అమితంగా ఇష్టపడే వాళ్లకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పేరుతో ఒక కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా విడతల వారీగా ఈ స్కీమ్ ను ప్రవేశపెడుతోంది.
ఈ నెల 9వ తేదీ నుంచి స్కీమ్ ప్రారంభం కానుండగా కేంద్రం ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకులలో గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. మార్కెట్ లో ఉన్న ధరతో పోల్చి చూస్తే గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే బంగారం ధర మరింత తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ ధర 5,237 రూపాయలు ఉండగా ఈ స్కీమ్ ద్వారా 5,177 రూపాయలకే గోల్డ్ లభిస్తుంది.
ఎవరైతే ఆన్ లైన్ లో గోల్డ్ ను కొనుగోలు చేస్తారో వారికి 5,127 రూపాయలకే బంగారం లభిస్తుంది. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్న నేపథ్యంలో వీటిలో పెట్టుబడులు పెట్టటానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు.
బ్యాంకులతో పాటు స్టాక్ ఎక్స్చేంజీలు, పోస్టాఫీస్ ల ద్వారా కూడా సులువుగా బంగారం కొనుగోలు చేయవచ్చు. అవసరం అయిన వాళ్లు ఐదు సంవత్సరాల తరువాత ఈ గోల్డ్ బాండ్లను విక్రయించవచ్చు. ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేసిన నగదుపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకులను, పోస్టాఫీస్ లను సంప్రదించి ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.