https://oktelugu.com/

Smartphone: స్మార్ట్ ఫోన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? గడువు తర్వాత వాడితే ఏమవుతుంది?

ఎలక్ట్రానిక్ అనే కాకుండా అన్ని వస్తువులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదని కొందరు అనుకుంటారు. అసలు స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్ని రోజులు వాడాలి? దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఉండదా? గడువు తర్వాత మొబైల్ వాడితే ఏమవుతుందో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 02:45 AM IST

    Mobile expiry

    Follow us on

    Smartphone: ఈ ప్రపంచంలో ప్రతీ వస్తువుకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మనం తినే పదార్థాల నుంచి వాడే వస్తువుల వరకు అన్నింటికి కూడా ఉంటుంది. కేవలం ఒక్క నెయ్యికి మాత్రమే ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. అయితే ప్రస్తుతం చాలా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సోషల్ మీడియా మైకంలో పడి ప్రతీ ఒక్కరూ వాడుతున్నారు. ఒక ఇంట్లో ఉండే మనుషుల కంటే స్మార్ట్‌ఫోన్‌లే ఎక్కువ అయిపోయాయి. ఒక పూట తినడం ఏమో అయిన మానేస్తారు. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్కపూట గడపరు. అయితే ఎలక్ట్రానిక్ అనే కాకుండా అన్ని వస్తువులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదని కొందరు అనుకుంటారు. అసలు స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్ని రోజులు వాడాలి? దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఉండదా? గడువు తర్వాత మొబైల్ వాడితే ఏమవుతుందో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    మార్కెట్లో ఎన్నో కొత్త ఫోన్‌లు వస్తుంటాయి. కొత్త ఫీచర్లతో కంపెనీలు లాంఛ్ చేస్తుంటాయి. అయితే కొందరు కొత్తగా వచ్చిన మోడల్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. మరికొందరు ఎన్నో ఏళ్ల నుంచి ఒకే ఫోన్‌ను వాడుతుంటారు. అసలు స్మార్ట్ ఫోన్‌కి కూడా ఒక గడువు తేదీ ఉంటుందనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. అయితే స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యేకంగా గడువు తేదీ ఏం ఉండదు. దాన్ని తయారు చేసిన తేదీ నుంచి కొన్ని ఏళ్లు మాత్రమే వాడాలి. ఆ తర్వాత వాడితే మొబైల్ కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లకు వాటిపైన అన్ని వివరాలు రాసి ఉంటాయి. మంచి కంపెనీకి చెందిన ఫోన్ అయితే ఎక్కువ ఏళ్లు వాడవచ్చు. అదే చీప్ బ్రాండ్ అయితే రెండేళ్లకే మొబైల్స్ పాడవుతాయి. యాపిల్ ఫోన్ అయితే ఐదేళ్లు, శామ్‌సంగ్, గూగుల్ పిక్సిల్ ఫోన్లు అయితే దాదాపు ఏడేళ్లు వాడవచ్చు. అయితే మొబైల్ ఫోన్లకు అప్‌డేట్ వంటివన్నీ ఉంటాయి. వాటి బట్టి స్మార్ట్ ఫోన్‌ను వాడవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలు తెలియక కొందరు ఒకటే ఫోన్‌ను ఎక్కువ రోజులు వాడుతుంటారు.

    స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఫోన్‌కి ఎంత సమయం ఛార్జింగ్ పెట్టాలి? ఎప్పుడు అప్‌డేట్ చేయాలనే వివరాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌ను రోజుకి కొంత లిమిట్‌గా వాడాలి. ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టి వదిలేయకూడదు. ఇలా చేస్తే తొందరగా బ్యాటరీలు పోతాయి. అయితే మనం ఉపయోగించే విధానం బట్టే స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం మన్నిక వస్తాయా? లేదా? అనే విషయం తెలుస్తుంది. ఎక్కువగా వాటిని ఉపయోగించిన కూడా తొందరగా పాడవుతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.