https://oktelugu.com/

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతున్నా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు అనుమతులు ఉన్న నేపథ్యంలో ఎక్కువమంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లు బిల్లుపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీలతో పాటు పన్నుల పేరుతో కంపెనీలు ఈ ఛార్జీలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 3, 2021 / 07:12 PM IST
    Follow us on

    దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలవుతున్నా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు అనుమతులు ఉన్న నేపథ్యంలో ఎక్కువమంది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లు బిల్లుపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

    హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీలతో పాటు పన్నుల పేరుతో కంపెనీలు ఈ ఛార్జీలను వసూలు చేస్తుండటం గమనార్హం. రెస్టారెంట్ లో ఉండే రేటుకు ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చే రేటుకు ఏకంగా 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన నియమనిబంధనలను రూపొందించలేదు. ఫలితంగా రెస్టారెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

    అదనపు వసూళ్లకు సంబంధించి సమాచార హక్కు ద్వారా ప్రశ్నించినా సరైన సమాధానం రావడం లేదని వినియోగదారులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధంగా వినియోగదారుడు మోసపోయిన పక్షంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందే అవకాశం అయితే ఉంటుంది. వినియోగదారుల మండలి లేదా తూనికలు కొలతల శాఖలో వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.

    ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ లో ఎక్కువ ధర వసూలు చేసినా డెలివరీ ఛార్జీ ఎక్కువ మొత్తం వేసినా వినియోగదారుడు మోసపోయినట్లే అవుతుంది. ఇలాంటి మోసాల విషయంలో రెస్టారెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.