కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ వల్ల వ్యాపారాలు చేసేవాళ్లు కోట్ల రూపాయలు నష్టపోయారు. సూరత్ టెక్స్ టైల్స్ మార్కెట్ ద్వారా దేశంలోని ప్రముఖ ప్రాంతాలకు వస్త్రాల సరఫరా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే సూరత్ టెక్స్ టైల్స్ వ్యాపారం పుంజుకుంటుండగా చీరల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పత్తి ధరల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్త్రాల ధరలపై పడింది.
సూరత్ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తుండగా ఈ ఉద్యోగుల వేతనాలను అక్కడి కంపెనీలు పెంచనున్నాయి. ఫలితంగా దీపావళి తర్వాత వస్త్రాల ధరలలో భారీగా మార్పు ఉండనుందని తెలుస్తోంది. వ్యాపారుల నిర్ణయం ప్రభావం రెడీమేడ్ వస్త్రాల ధరలపై భారీగా పడనుందని తెలుస్తోంది. దీపావళి తర్వాత చీరల ధరలు, ఇతర వస్త్రాల ధరలు ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల కూడా వస్త్రాల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో చీరలు, ఇతర వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని చెప్పవచ్చు. మరోవైపు నూలు రేట్లు, గ్రే ఫ్యాబ్రిక్ రేట్లతో పాటు గ్రే ఫ్యాబ్రిక్ ధరలు కూడా భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. 100 రూపాయలకు 10 రూపాయల చొప్పున 1000 రూపాయలకు 100 రూపాయల చొప్పున ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
నవంబర్ నెల 11వ తేదీన ఇక్కడ మార్కెట్ తిరిగి ప్రారంభం కానుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు చీరలు, ఇతర వస్త్రాల ధరలు పెరగడం వల్ల నష్టాలు తప్పవని తెలుస్తోంది.