Scrapping Car: ఒక కారు పాతది కాగానే దానితో ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే కొందరు చాకచక్యంగా కార్ల కంనీలు ఇచ్చే ఎక్చేంజ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తాయి. కంపెనీలు ప్రత్యేక రోజుల్లో, పండుగల సమయాల్లో ఇలాంటి అవకాశం ఇస్తాయి. కానీ ఇప్పుడు 21 రాష్ట్రాల్లో ఎక్చేంజ్ ఆఫర్స్ ను ప్రకటించాయి. పాత కారును ఇచ్చి కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి రాయితీ ప్రకటించింది. కొన్ని వాహనాలు చాలా పాతవి కావడంతో వాటని స్క్రాపింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కార్ల వినియోగదారులకు ఆఫర్స్ ఇస్తూ స్క్రాప్ ను తీసేయాలని చూస్తోంది. అయితే ఎంత వరకు రాయితీ ఉందంటే?
సాధారణంగానే పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా స్క్రాపింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. అయితే ఇదే సమయంలో వినియోగదారులు తమంతట తాము తమ పాత కార్లను స్క్రాప్ చేసే విధంగా కొత్త కారు కొనుగోలుపై రాయితీలు ప్రకటించింది. ఇలా చేయడం వల్ల స్క్రాపింగ్ ను పెద్ద ఎత్తున తొలగించివచ్చని ప్లాన్ వేసింది. ఈ మేరకు 21 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతుంది.
గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, బీహార్ తో సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాత కార్ల ను తీసేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇక్కడ పాత కారును ఇచ్చినందుకు వినియోగదారుడికి కొత్త కారు కొనుగోలుపై 25 శాతం తగ్గింపును ఇస్తారు. ఇదే తగ్గింపు వాణిజ్య వాహనాలపై 15 శాతం ఉంది. పాత వెహికల్స్ ఇప్పటి వరకు దాదాపు 70 వేల వరకు పనికి రాకుండా పోయాయి. వీటిలో ఎక్కువ భాగంగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వే ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓ వైపు పాత వాహనాల స్క్రాపింగ్ తో పాటు ఫిట్ నెస్ చెక్ చేయడానికి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 52 ఆటేమేటిక్ పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా పాత వాహనాల ఇచ్చి.. కొత్త వాహనాలు తీసుకునేవారికి రిజిస్ట్రేషన్ సమయంలో వాణిజ్య వాహనాలపై 15 శాతం రోడ్డు పన్ను రాయితీ ఇవ్వబడుతుంది. ప్రైవేట్ వాహనాలపై 25 శాతం రాయితీ ఉండనుంది. ఉత్తరాఖండ్ లో మాత్రం 25 శాతం లేదా రూ.50 వేల వరకు డిస్కౌంట్ ను ఇస్తున్నారు.