ఎస్బీఐ డెబిట్ కార్డును కలిగి ఉన్నారా.. ఫ్రీగా రూ.2 లక్షల బెనిఫిట్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లకు వివిధ రకాల డెబిట్ కార్డులను అందిస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న కార్డులలో రూపే జన్ ధన్ కార్డు కూడా ఒకటి కాగా ఎవరైతే ఈ కార్డును కలిగి ఉంటారో వారు ఉచితంగా 2 లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా పొందవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా జన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 21, 2021 8:53 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లకు వివిధ రకాల డెబిట్ కార్డులను అందిస్తోంది. ఎస్బీఐ అందిస్తున్న కార్డులలో రూపే జన్ ధన్ కార్డు కూడా ఒకటి కాగా ఎవరైతే ఈ కార్డును కలిగి ఉంటారో వారు ఉచితంగా 2 లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా పొందవచ్చు.

ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు ఈ శుభవార్త చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ జన్ ధన్ యోజన స్కీమ్ అమలులో భాగంగా పేదలు జీరో బ్యాలెన్స్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మోదీ సర్కార్ పేదలందరికీ బ్యాంక్ ఖాతా అందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేయాలనుకుంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి సులభంగా ఓపెన్ చేయవచ్చు.

ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోలు ఇవ్వడం ద్వారా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతా కలిగి ఉండటం వల్ల ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే జన్ ధన్ అకౌంట్ ను కలిగి ఉంటారో వాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కూడా పొందే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతా కలిగి ఉండటం వల్ల ఫ్రీగా రూపే డెబిట్ కార్డును పొందడం సాధ్యమవుతుంది.

సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఉచిత డెబిట్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎస్బీఐ ఇస్తున్న ఫ్రీ ఇన్సూరెన్స్ సదుపాయం వల్ల ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాళ్లందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.