Maruti Suzuki
Maruti Suzuki: కారు కొనాలనుకునే చాలా మంది తక్కువ ధర తో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాటి కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీలు సైతం అధిక మైలేజ్ ఇచ్చే కార్లను ఇటీవల ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దేశీయ ఆటోమోబైల్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న మారుతి సుజుకీ మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఎన్నో మోడళ్లను తీసుకొచ్చింది. అదే సమయంలో ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు తక్కువ ధరలను నిర్ణయిస్తోంది. ఈ కంపెనీ నుంచి ఎక్కువ మైలేజ్ ఇచ్చేకార్ల గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన ఎస్ -ప్రెస్సో లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ మోడల్ లీటర్ కు 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.4.26 లక్షల ఎక్స్ షూరూం ధరతో విక్రయిస్తున్నారు. రెనాల్డ్ క్విడ్ అనే కారు ఇదే కోవకు చెందినది. 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఈ మోడల్ లీటర్ కు 22.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని 4.69 లక్షలతో విక్రయిస్తున్నారు.
మారుతి సుజుకీ నుంచి మంజి మైలేజ్ ఇచ్చే మరో మోడల్ సెలెరియో. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 24.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.36 లక్షలతో విక్రయిస్తున్నారు. మారుతి నుంచి బెస్ట్ మోడల్ గా నిలిచిన కార్లలో వ్యాగన్ ఆర్ ఒకటి. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 25.29 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.45 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. హ్యాచ్ బ్యాక్ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇదొకటి.
మారుతి సుజుకీ నుంచి వినియోగదారులను ఆకర్షిస్తున్న మరో మోడల్ స్విప్ట్. 1.2 లీటర్ పెట్రోల్, 4 సిలిండర్ ను కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి కార్లలో ఇదొకటి. దీనిని వివిధ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో అత్యధికంగా 22.56 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.99 లక్షల నుంచి నుంచి విక్రయిస్తున్నారు. ఇవేకాకుండా మారుతి నుంచి మరికొన్ని మోడళ్లు కూడా తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి.