https://oktelugu.com/

Jandhan Accounts:  ప్రీమియం చెల్లించకుండానే రూ.2 లక్షల బీమా.. ఎలా పొందాలంటే?

Jandhan Accounts:  దేశంలో ప్రస్తుతం జీరో బ్యాలెన్స్ ఖాతాలను వినియోగించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకులపై భారం పెరుగుతున్నా సామాన్యులకు మాత్రం ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులలో సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లను జన్ ధన్ అకౌంట్లు అని కూడా పిలుస్తారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2022 / 11:16 AM IST
    Follow us on

    Jandhan Accounts:  దేశంలో ప్రస్తుతం జీరో బ్యాలెన్స్ ఖాతాలను వినియోగించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకులపై భారం పెరుగుతున్నా సామాన్యులకు మాత్రం ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులలో సైతం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లను జన్ ధన్ అకౌంట్లు అని కూడా పిలుస్తారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ను ఉంచాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ ఖాతాలలో డిపాజిట్ చేసే మొత్తం, విత్ డ్రా చేసే మొత్తంపై మాత్రం పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్లను అందిస్తోంది.

    మరోవైపు జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ల మొత్తం కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఖాతాలలో డిపాజిట్ చేసిన మొత్తం లక్షన్నర కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాగా దేశంలో 44.23 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. ఎవరైతే ఈ ఖాతాలను కలిగి ఉంటారో వాళ్లకు రూపే డెబిట్ కార్డులు సైతం పొందే ఛాన్స్ ఉంటుంది.

    ఈ రూపే డెబిట్ కార్డులను కలిగి ఉన్నవాళ్లకు 2 లక్షల రూపాయల వరకు బీమా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పొందే ప్రయోజనాలన్నీ జన్ ధన్ ఖాతాల ద్వారా పొందే అవకాశం ఉంటుంది.