Homeబిజినెస్Royal Enfield new bikes: బైక్ లవర్స్ ఇక కాచుకోకండి.. Royal Enfield కొత్త బైక్స్...

Royal Enfield new bikes: బైక్ లవర్స్ ఇక కాచుకోకండి.. Royal Enfield కొత్త బైక్స్ ఇవే..

Royal Enfield new bikes: భారతీయ బైక్ లవర్స్‌కు Royal Enfield అంటే ప్రత్యేకమైన క్రేజ్. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ ఈ కంపెనీ సరికొత్త టెక్నాలజీ , పవర్‌ఫుల్ ఇంజన్లతో సరికొత్త బైకులను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. హిమాలయన్ 750 , ఫ్లయింగ్ ఫ్లీ S6 , కాంటినెంటల్ GT 750 బైకులు రాబోతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ రైడ్ తో పాటు వేగవంతమైన ప్రయాణం కోరుకునేవారికి ఇవి బెస్ట్ మోడల్స్ గా నిలవనున్నాయి. మరి ఈ బైక్ లు ఎలా ఉండబోతున్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 (Himalayan 750):
లాంగ్ రైడ్స్ తో పాటు ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం ఇది అత్యంత పవర్‌ఫుల్ అడ్వెంచర్ బైక్ ఇది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హిమాలయన్ 450 కంటే ఇది చాలా పెద్దదిగా, శక్తివంతంగా ఉండబోతోంది. ఇందులో 750cc ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది సుమారు 55 bhp పవర్, 60-65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని హెడ్‌లైట్ గ్రిల్, సర్క్యులర్ TFT డిస్‌ప్లే , లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ అందించనున్నారు. 2026 నవంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 4.00 లక్షల నుంచి రూ. 4.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

ఫ్లయింగ్ ఫ్లీ S6 (Flying Flea S6):
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ ‘ఫ్లయింగ్ ఫ్లీ’ నుండి రాబోతున్న రెండవ మోడల్ ఈ S6. నగరాల్లో తిరగడానికే కాకుండా, కొద్దిగా గరుకు రోడ్లపై కూడా ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ఇందులో 3.91 kWh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌లో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, 19 అంగుళాల ఫ్రంట్ ,18 అంగుళఆల రియర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. 3.5 అంగుళాల టచ్‌స్క్రీన్ అలరిస్తుంది. స్విచబుల్ ABS వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 3.40 లక్షలు ఉండవచ్చు.

కాంటినెంటల్ GT 750 (Continental GT 750):
రాయల్ ఎన్‌ఫీల్డ్ తెస్తున్న లగ్జరీ అప్‌గ్రేడ్ ‘కాంటినెంటల్ GT 750’. ప్రస్తుత GT 650 మోడల్‌కు ఇది నెక్స్ట్ లెవెల్ వెర్షన్. ఇందులో సరికొత్త 750cc ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ను అమర్చనున్నారు. దీని ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అందించడం ఈ బైక్ యొక్క అతిపెద్ద మార్పు. అంతేకాకుండా, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌ను సపోర్ట్ చేసే సరికొత్త డిజిటల్ కన్సోల్ ఉండబోతోంది. మార్కెట్ దీని ధర సుమారు రూ. 3.80 లక్షల నుండి రూ. 3.90 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version