Roman Saini: సాధించాలన్నా తపన ఉంటే చంద్రమండలమైనా ఎక్కొచ్చు.. అని నిరూపిస్తున్నారు ఈరోజుల్లో. ఒకప్పుడు పొట్ట కూటి కోసం ఎన్నో విద్యలు చేశారు. కానీ ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేయడానికి అనువైన వాతావరణం ఉండడంతో పాటు చాలా మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద ప్రయోగాలు చేపట్టి అత్యున్నత శిఖరానికి ఎదుగుతున్నారు. 30 ఏళ్ల ఓ యువకుడు సగజీవితం కాకముందే జీవితంలో అన్నీ సాధించాడు. ఈ వయసులో ఆయన నికర ఆదాయం విలువ రూ.2600 కోట్లు ఉందంటే ఎవరైనా నమ్మగలుగుతారా? కానీ ఇది పచ్చి నిజం. అంతేకాకుండా 18 ఏళ్లకే డాక్టరయి.. 22 సంవత్సరాల్లోనే కలెక్టర్ అయిన ఆ యువకుడి ప్రతిభ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన గురించి మీకోసం..
గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే కొందరు ఏళ్ల తరబడి దీక్షలు చేస్తారు. అయినా ఫలితం దక్కదు. కానీ కొందరు ఫస్ట్ అటెమ్ట్ లోనే ఐఏఎస్ పాసవుతారు. కానీ రోమన్ షైనీ అనే యువకుడు మాత్రం వీరికి భిన్నంగా ఉన్నాడు. కేవలం 18 ఏళ్లలోనే డాక్టర్ అయ్యాడు. రోమన్ షైనీ స్కూల్ కెళ్లే వయసులోనే చురుగ్గా ఉండేవాడు. పదోతరగతిలో అతను 85.5 శాతం మార్కులు సాధించాడు. ఆ తరువాత ఇంటర్ లో 91.4 శాతంతో ఉత్తీర్ణత అయ్యాడు. ఇక గ్రాడ్యుయేషన్ లో 63 శాతంతో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. తనకు 16 ఏళ్ల వయసు ఉండగానే ఏఐఐఎంఎస్ వైద్య పరీక్షలో ఉత్తీర్ణత కావడంతో 21 సంవత్సరాల వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఏఐఐఎంఎస్ వైద్య శాలలోనే ఆరు నెలల పాటు పనిచేశాడు.
రోమన్ షైనీ డాక్టర్ చదివినా తనకు కలెక్టర్ కావానేకోరిక ఉండేది. దీంతో యూపీఎస్ పరీక్షలు రాశాడు. 22 ఏళ్ల వయసులో ఉండగానే యూపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. మధ్యప్రదేశ్ లో 20 నెలల పాటు అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసిన ఆయన తన వృత్తి సంతృప్తినివ్వలేదు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించాలని తట్టింది. తాను అనుకున్నది చేయడానికి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత తన స్నేహితులు గౌరవ్ ముంజల్, హేమేశ్ సింగ్ లతో కలిసి బెంగుళూరులో ‘అన్ అకాడమీ’ పేరుతో స్టార్టప్ ను ప్రారంభించాడు. దీని ద్వారా ఆన్లైన్లో కొన్నాళ్ల పాటు ఉచితంగా యూపీఎస్ కోచింగ్ ను ఇచ్చారు.
ఆ తరువాత దీనిని కంపెనీగా మార్చుకొని వివిధ పోటీ పరీక్షల కోసం ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీనికి దేశ వ్యాప్తంగా స్పందన రావడంతో ఈ కంపెనీ కోట్ల టర్నోవర్ సాధించింది. మెడికల్, ఇంజినీరింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ వారికి కోచింగ్ అందిస్తున్నారు. ఇలా వీరి సంపాదన పెరిగి వార్షిక టర్నోవర్ రూ.15 వేల కోట్లకు దాటింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా వివిధ శాఖలను ఏర్పాటు చేశారు. 18 వేల మంది విద్యావేత్తలతో అభ్యర్థులకు కోచింగ్ ఇస్టున్నారు. ప్రస్తుతం అన్ అకాడమీకి సీఈవోగా గౌరవ్ ముంజల్ ఉన్నారు. ఈయన రూ.1.5 కోట్లు, హేమేష్ సింగ్ రూ.1.19 కోట్లు, రోమన్ షేనీ రూ.88 లక్షలు అందుకున్నాడు. మొత్తం 26 వేల కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీ ఏర్పడడానికి రోమన్ షైనీ నే కారణం. దీంతో అతడికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.