Rolls Royce Price in Pakistan
Rolls Royce Price in Pakistan : రోల్స్ రాయిస్ కారు అంటేనే విలాసవంతమైన జీవితానికి సంకేతం. ప్రపంచవ్యాప్తంగా ఈ కారును ధనికులు మాత్రమే కొనుగోలు చేసే స్థితిలో ఉంటారు. భారతదేశంలోనూ ఈ కారును కొద్ది మంది మాత్రమే కలిగి ఉంటారు. ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు రోల్స్ రాయిస్ యజమానులుగా నిలిచారు.
భారతదేశంలో రోల్స్ రాయిస్ ధర
భారతదేశంలో రోల్స్ రాయిస్ కార్ల ధర సుమారు రూ. 7 కోట్ల నుండి రూ. 12 కోట్ల మధ్య ఉంటుంది. వీటి విలాసవంతమైన రూపం, సౌకర్యం, అత్యాధునిక టెక్నాలజీ కారణంగా అంత పెద్ద మొత్తంలో ధర ఉంటుంది.
పాకిస్తాన్‌లో రోల్స్ రాయిస్ ఖరీదు?
పాకిస్తాన్‌లో రోల్స్ రాయిస్ కొనుగోలు చేయడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే, అక్కడ ఈ కంపెనీకి ఒక్క డీలర్‌షిప్ కూడా లేదు. ఈ కారును కొనుగోలు చేయాలంటే, పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ధర మరింత పెరుగుతుంది. పాకిస్తాన్‌లో ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును రూ. 20 నుంచి రూ. 30 కోట్ల మధ్య కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం.. పాక్‌వీల్స్ వెబ్‌సైట్‌లో ఒక ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు రూ. 19.74 కోట్లకు అందుబాటులో ఉంది. కొత్త కారు కొనడం అక్కడ ఒక కలనే చెప్పుకోవాలి.
రోల్స్ రాయిస్ ఫీచర్లు – భద్రతకు హైటెక్ టచ్
రోల్స్ రాయిస్ కార్లు అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన లగ్జరీ కార్లలో ఒకటిగా పేరుగాంచాయి. ముఖ్యంగా ఫాంటమ్ మోడల్ అత్యుత్తమ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఎనిమిది-తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, హై బీమ్ అసిస్ట్, చైల్డ్ లాక్, బ్రేక్ అసిస్ట్, ABS, సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి భద్రతా లక్షణాలు అందించబడ్డాయి. రోల్స్ రాయిస్ కార్లకు కస్టమైజేషన్ (అనుకూలీకరణ) సేవలు కూడా లభిస్తాయి. యజమాని అభిరుచికి అనుగుణంగా కారును డిజైన్ చేసుకోవచ్చు. అయితే, దీని వల్ల ఖర్చు ఇంకా పెరుగుతుంది.
భారతదేశంలోనే రోల్స్ రాయిస్ కొనడం కొందరికి మాత్రమే సాధ్యమైతే, పాకిస్తాన్‌లో దీని ఖరీదు సాధారణంగా అందనంత ఎత్తుకు వెళ్లింది. ఒక లగ్జరీ కార్ ధర ఒక ప్రీమియం ప్రాపర్టీ ధరతో సమానం అవుతోంది. విలాసవంతమైన జీవితం కోరుకునే వారు దీని కోసం కోట్లు ఖర్చు చేయాల్సిందే.