RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి బుధవారం సమావేశమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంతా దాస్ ద్రవ్యపరపతి కమిటీ భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఐదుగురు రెపో రేటు ను యధాతధంగా ఉంచాలని సిఫారసు చేయడంతో.. ఎటువంటి మార్పులు లేకుండానే రెపో రేటును 6.5 శాతంగా ఉంచారు. మానిటరీ పాలసీ కమిటీలో ఆరుగురు సభ్యులు ఐదుగురు రెపో రేటు 6.5 శాతం ఉండేలాగా ఓటు వేయడంతో.. దానికే ఆమోదముద్ర రియాల్సి వచ్చిందని శక్తి కాంత్ దాస్ వెల్లడించారు. ఇప్పటికే మానిటరీ పాలసీ ఫ్రేమ్ వర్క్ కు 8 సంవత్సరాలు పూర్తి కావడంతో.. సంస్థాగతంగా ఈ సంస్కరణ చేపట్టామని శక్తి కాంతదాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..” ఏడాది చివరి వరకు ఆహారానికి సంబంధించిన ధరలు తగ్గుతాయి. సమృద్ధిగా వర్షాల కురిసాయి. బఫర్ స్టాక్ కూడా కావాల్సిన స్థాయిలో ఉంది. దీనివల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. జిడిపిలో ఇన్వెస్ట్మెంట్ చేరు అత్యధిక స్థాయికి వెళ్ళింది. స్వదేశీ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వస్తువుల తయారీ రంగం దాటిన పడింది. ప్రభుత్వ విధానాలు కూడా ఇందుకు తోడ్పడుతున్నాయని” శక్తికాంత దాస్ పేర్కొన్నారు…
ధరలు దిగి వస్తాయా?
రెపో రేటు ను యధాతధంగా ఉంచడంతో ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు మండిపడుతున్నాయి. పచ్చిమాసియా దేశాలలో నెలకొన్న అనిశ్చితి వల్ల పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరిగితే.. అవి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయి. అలాంటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు విషయంలో కాస్త సడలింపులు ఇస్తే బాగుండేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.. అధిక వర్షాల వల్ల ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కూరగాయల ధరలు పెరిగాయి.. నూనెల పై దిగుమతి సుంకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో.. వంట నూనెల ధర పెరిగింది. ఇన్ని పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుసగా పదోసారి కూడా రెపో రేటు ను మార్చకపోవడం వల్ల అది అంతిమంగా ప్రజలపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ వర్గాలు ఈ సందర్భంగా అంటున్నాయి.