Reliance Scholarships: రిలయన్స్ ఫౌండేషన్ ప్రతిభావంతమైన విద్యార్థులకు తీపికబురు అందించింది. 100 మంది ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడానికి రిలయన్స్ ఫౌండేషన్ సిద్ధమైంది. ప్రతిభ గల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఈ సంస్థ ఆహ్వానిస్తోంది.
ఎలక్ట్రికల్ /లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హులని చెప్పవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సైతం ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.
Also Read: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?
ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన 60 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గరిష్టంగా 4 లక్షల రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గరిష్టంగా 6 లక్షల రూపాయలు స్కాలర్ షిప్ గా లభిస్తుంది. అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందిన విద్యార్థులు ప్రముఖ ప్రపంచ నిపుణులతో సంభాషించవచ్చు.
గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న https://www.scholarships.reliancefoundation.org/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: కట్నం డబ్బులతో పరారైన వరుడు… ఆందోళనకు దిగిన వధువు.. చివరికి ఇలా!