Homeబిజినెస్Bad habits to quit for success: ఈ అలవాట్లను వదులుకుంటే.. మీరు కచ్చితంగా కోటీశ్వరులవుతారు

Bad habits to quit for success: ఈ అలవాట్లను వదులుకుంటే.. మీరు కచ్చితంగా కోటీశ్వరులవుతారు

Bad habits to quit for success: ముకేశ్ అంబానీ మనదేశంలో అత్యంత ధనవంతుడు. ప్రపంచంలో ఐదు లేదా ఆరో స్థానంలో ఉంటాడు. పెట్రోల్ నుంచి మొదలుపెడితే కూల్ డ్రింక్ వరకు అతడు చేయని వ్యాపారం అంటూ లేదు. ముకేశ్ అంబానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి ప్రధాన కారణం అతడు కష్టపడి పని చేసే విధానం. దానికంటే ముందు తండ్రి ధీరుభాయ్ అంబానీ నేర్పిన వ్యాపార పాఠాలు. ముకేశ్ అంబానీ.. అనిల్ అంబానీ ఒకేసారి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో అనిల్ ముఖేష్ ను దాటేశాడు. అడాగ్.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్.. రిలయన్స్ మొబైల్స్.. బిగ్ సినిమాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనిల్ ఎన్నో వ్యాపారాలు చేశారు.

ఆ వ్యాపారాలలో అనిల్ లాభాలు గడించారు. అయితే ఆ లాభాలను ఇతర వ్యాపారాలలోకి మళ్లించి ఉంటే అనిల్ స్థాయి మరో విధంగా ఉండేది. కానీ ఆ లాభాలతో ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. తన భార్యకు అత్యంత ఖరీదైన బంగ్లాలు.. విమానాలు.. ఓడలు కొనివ్వడం ప్రారంభించారు. వ్యాపారాన్ని పట్టించుకోలేదు. విలాసాలకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చారు. నష్టాలు మొదలయ్యాయి. అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి. చివరికి ఆర్బిట్రేషన్ కోర్టుల ముద్దు తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఇండియాలో అతిపెద్ద ధనవంతుడిగా పేరుపొందిన అనిల్.. ఇప్పుడు బ్యాంకులకు బకాయిదారుగా మారిపోయారు.

అనిల్ మాదిరిగానే ముఖేష్ వ్యవహరించలేదు. వినూత్నమైన వ్యాపారాల్లోకి ప్రవేశించారు. కష్టాన్ని నమ్ముకున్నారు. లాబీయింగ్ వదిలిపెట్టలేదు. అలాగని ఖరీదైన వస్తువులను కొనడం మానేయలేదు. తన అవసరం ఆధారంగానే వాటిని కొనుగోలు చేశారు. ఆస్తులను పెంచుకున్నారు. లాభాలను కూడా ఆదే స్థాయిలో స్వీకరించారు. వంద రూపాయల లాభం వస్తే అందులో పది రూపాయలు విలాసాల కోసం ఖర్చు చేశారు. ఫలితంగా అన్ని రకాల వ్యాపారాలలోకి అడుగు పెట్టారు. మనదేశంలో అతిపెద్ద ఆగర్భ శ్రీమంతుడిగా వెలుగొందుతున్నారు.

అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ జీవితాలు కేవలం ఉదాహరణ మాత్రమే కాదు.. ఒక మనిషి జీవితానికి సంబంధించిన పాఠాలు. ఇదే విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త కూడా చెబుతుంటారు. ఆర్థికంగా ఎదగాలంటే కొన్ని అలవాట్లను కచ్చితంగా వదిలించుకోవాలని ఆయన స్పష్టం చేస్తుంటారు.. ” క్రెడిట్ కార్డు ద్వారా చాలామంది అప్పులు చేస్తారు. ఆ అప్పులు ఎప్పటికీ మంచిది కాదు. సంపాదన నుంచి ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే ఖర్చు చేయడానికి ముందడుగు వేయాలి. గొప్పల కోసం వస్తువులను కొనుగోలు చేయొద్దు. కేవలం అవసరాల ఆధారంగా మాత్రమే వాటిని కొనుగోలు చేయాలి. బెట్టింగ్ వంటి వ్యసనాలకు పాల్పడకూడదు. ముఖ్యంగా మార్కెట్ రిస్క్ తో కూడుకొని ఉండే పథకాలలో ఇన్వెస్ట్ చేయకూడదు. పొదుపుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. క్రమశిక్షణతో కూడిన మార్పులు జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతాయి.. అప్పుడే మనం ధనవంతులుగా మారుతామని” బఫెట్ చెబుతున్నారు.

వారెన్ బఫెట్ ఇప్పటికీ కూడా ఒక నియమితమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంటారు. విలాసాల జోలికి ఆయన అసలు వెల్లరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు చేయరు. ఒకవేళ అప్పులు చేసినా.. వాటిని తీర్చగలిగే సామర్థ్యం ఉంటేనే ఆయన ఆ పని చేస్తారు. వృధాగా రూపాయి కూడా ఖర్చు పెట్టారు. సంపాదించిన డబ్బులు కొంత పొదుపుకు వెళ్తుంది. కొంత ఛారిటికి వెళుతుంది. మిగతాది భవిష్యత్తు కార్యకలాపాల విస్తరణకు వెళ్తుంది. ద్వారా ఆయనకు ఒత్తిడి అనేది ఉండదు. ఎలా సంపాదించాలి అనే బాధ ఉండదు. డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పటిక.. డబ్బు అనేది అంటించుకోకపోవడమే మెరుగైన సూత్రమని బఫెట్ అంటుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version