Punjab National Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.2వేల కోట్ల మోసం.. ఆర్బీఐ ముందుకు వివాదం

Punjab National Bank Fraud:  ఒక్క బ్యాంకు చేసిన కుంభకోణం బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంతో మిగతా బ్యాంకులు అలర్ట్ అయ్యాయి. దీంతో ఏయే బ్యాంకులకు బడాబాబులు ఏ విధంగా పంగనామం పెట్టారో బయటపడ్డాయి. మొత్తంగా దేశంలో ఓ వైపు వ్యాపార వేత్తలుగా ఎదుగుతూనే.. మరోవైపు బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులు ఇప్పుడు దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే వారి వ్యాపారానికి అప్పు ఇచ్చిన బ్యాంకులు మాత్రం నష్టాల మూట కట్టుకున్నాయి. […]

Written By: NARESH, Updated On : March 16, 2022 3:55 pm
Follow us on

Punjab National Bank Fraud:  ఒక్క బ్యాంకు చేసిన కుంభకోణం బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంతో మిగతా బ్యాంకులు అలర్ట్ అయ్యాయి. దీంతో ఏయే బ్యాంకులకు బడాబాబులు ఏ విధంగా పంగనామం పెట్టారో బయటపడ్డాయి. మొత్తంగా దేశంలో ఓ వైపు వ్యాపార వేత్తలుగా ఎదుగుతూనే.. మరోవైపు బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులు ఇప్పుడు దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే వారి వ్యాపారానికి అప్పు ఇచ్చిన బ్యాంకులు మాత్రం నష్టాల మూట కట్టుకున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు తనకు జరిగిన నష్టాన్ని ఆర్బీఐకి వివరించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేసిన ఘనకార్యమెంతో తన నివేదికలో పేర్కొంది.

Punjab National Bank

తమ బ్యాంకులో రూ.2 వేల కోట్ల వరకు మోసం జరిగిందని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. గతంలో సంచలనం సృష్టించిన బ్యాంకు కుంభకోణం విషయంలో తాజాగా ఆ బ్యాంకు ఆర్బీఐకి వివరణ ఇచ్చింది. ఎక్కడెక్కడా మోసం జరిగిందో తెలిపింది. తమిళనాడు పవర్ కంపెనీకి చెందిన ఎన్ పీఏ ఖాతాలో, ఢిల్లీలోని ఎక్స్ ట్రా లార్జ్ కార్పొరేట్ బ్రాంచ్ లో చీటింగ్ జరిగిందని తెలిపింది. మొత్తంగా రూ.2,060.14 కోట్ల మోసం జరిగినట్లు పీఎన్ బీ ప్రతినిధులు వెల్లడించారు. నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ (పీఎన్పీఏ) ఖాతాలో రూ.2,060.14 కోట్ల రుణ మోసం జరిగిందని పేర్కొంది. గతంలో ఈ బ్యాంకు నుంచి నీరవ్ మోదీ కోట్ల రూపాయాలు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సొమ్ము మొత్తాన్ని లెక్కగట్టి తాజాగా ఈ బ్యాంక్ ఆర్బీఐకి నివేదించింది.

Also Read: AP Politics: ప‌వ‌న్‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిందా.. బీజేపీ రూట్ మ్యాప్ ఏంటి..?

పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉన్నతాధికారుల తీరుతో ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థపైనే నమ్మకం పోయింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్యాంకుకు చెందిన ఉద్యోగులు అప్పనంగా రూ.12 వేల కోట్ల రూపాయలు అప్పనంగా దారపోశారు. ఈ డబ్బుతో వ్యాపారం చేసిన ఆయన అంతకంతకు సంపాదించుకున్నాడు. కానీ ఆ డబ్బు అంతా పట్టుకొని విదేశాలకు పారిపోయాడు. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. బ్యాంకులో కుంభకోణం జరిగిందని యాజమాన్యమే సీబీఐకి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో సంచలనం రేపింది. దీంతో ఈ బ్యాంకులో పెట్టిన 3వేల కోట్లకు పైగా షేర్లు హరించుకుపోయాయి.

ఇక నీరవ్ మోదీతో పాటు విజయ్ మాల్యా కూడా బ్యాంకుకు ఎగ్గొట్టిన విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కింగ్ ఫిషర్, తదితర కంపెనీలకు అధిపతిగా ఉన్న విజయ్ మాల్యా మొత్తం 9 వేల కోట్లు బ్యాంకులకు బాకీ ఉన్నట్లు తేలింది. ఎస్బీఐ తో పాటు దాదాపు 15 బ్యాంకుల్లో రుణం తీసుకున్న ఆయన ప్రస్తుతం విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నారు. అయితే ఇటీవల ఆయన రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ బ్యాంకులు దానిని తిరస్కరించారు. 2016లో బ్రిటన్ వెళ్లిన మాల్యా ఇంతవరకు దేశానికి తిరిగి రాలేదు.ఇలా పంజాబ్ నేషనల్ బ్యాంకులో నీరవ్ మోడీతోపాటు చాలా మంది రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు. ఆ విలువ వేల కోట్లు. తాజా  మోసంతో పీఎన్.బీ అధికారుల నిర్లక్ష్యం, రుణాలు ఇవ్వడంలో చూపిన ఉదారతపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: KCR Praises On Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత మల్లు భట్టికి ఓఫెన్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్