Pension Scheme: ప్రధానమంత్రి వయ వందన యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు అమలు చేయనుంది. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది.
వృద్ధాప్యంలో పెన్షన్ ద్వారా అసరా పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఎల్ఐసీ ఈ స్కీమ్ కు సంబంధించిన బాధ్యతలను తీసుకోవడం గమనార్హం.
ఏడాదికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీరేటులో మార్పు చేస్తోంది. ఆధార్ నంబర్ సహాయంతో ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ ఉండగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 10,000 పెన్షన్ పొందాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి. పదేళ్ల తర్వాత పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కనీసం 60 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హత కలిగి ఉంటారు. పాలసీ గడువు కనీసం 10 సంవత్సరాలుగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ మొత్తం మారుతుంది. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత అవసరమైతే రుణం కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: Telangana Yadadri: ఏపీకి తిరుపతిలా.. తెలంగాణ యాదాద్రి మణిహారం