Post Office Schemes: ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి నెలా కొంత మొత్తం పోస్టాఫీస్ స్కీమ్స్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం బెనిఫిట్ ను పొందవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగం కాగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కచ్చితంగా మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉండటంతో ఈ స్కీమ్స్ పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.
Also Read: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.10 లక్షల రుణం.. ఎలా పొందవచ్చంటే?
పోస్టాఫీస్ లో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉండగా ఎంచుకునే స్కీమ్ ను బట్టి రాబడి పొందే ఛాన్స్ ఉంటుంది. స్కీమ్ ను బట్టి పొందే బెనిఫిట్స్ లో మార్పులు కూడా ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణమైన స్కీమ్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. పోస్టాఫీస్ లోని కొన్ని స్కీమ్స్ లో 1,000 రూపాయల నుంచి డబ్బులను ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ ఉండగా ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 1,40,000 రూపాయలు పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 100 రూపాయలతో ఆర్‌డీ ఖాతా తెరవొచ్చు. నెలకు ఈ స్కీమ్ లో 2,000 రూపాయల చొప్పున చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో 1,40,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
Also Read: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?