https://oktelugu.com/

Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సులువుగా రెట్టింపు డబ్బులు పొందే అవకాశం?

Post Office Scheme: ప్రస్తుతం ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా ఆ డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సేవింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పది సంవత్సరాల తర్వాత రెట్టింపు అవుతాయి. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందనే సంగతి తెలిసిందే. అందువల్ల ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2021 / 09:30 AM IST
    Follow us on

    Post Office Scheme: ప్రస్తుతం ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా ఆ డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సేవింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పది సంవత్సరాల తర్వాత రెట్టింపు అవుతాయి. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందనే సంగతి తెలిసిందే.

    అందువల్ల ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.9 శాతం వడ్డీని అందిస్తుండటం గమనార్హం. 2020 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీని అందిస్తోంది. కనీసం 1,000 రూపాయలతో పోస్టాఫీస్ లో ఈ స్కీమ్ కు సంబంధించిన ఖాతాను తెరవవచ్చు.

    గరిష్ట పరిమితి లేకపోవడంతో ఈ స్కీమ్ లో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పది సంవత్సరాల వయస్సు ఉన్న మైనర్లు సైతం ఈ స్కీమ్ లో ఖాతా తెరిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ముగ్గురు సభ్యుల వరకు జాయింట్ అకౌంట్ తెరిచే అవకాశం అయితే ఉంటుంది.

    కొన్ని సందర్బాల్లో మాత్రమే ఈ అకౌంట్ మరో వ్యక్తికి బదిలీ చేయబడుతుంది. ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఖాతాదారుడు మరణిస్తే జాయింట్ హోల్డర్ కు ఖాతాను బదిలీ చేయవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ఖాతాను బదిలీ చేయడంతో పాటు ఖాతాను తనిఖీ పెట్టవచ్చు.