Poco M6 Plus 5g: పోకో M6 ప్లస్ 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. ఆ ఫీచర్లను చూస్తే షాక్ అవ్వాల్సిందే..

పోకో ఎం6 ప్లస్ 5జీ, బడ్స్ ఎక్స్1 స్మార్ట్ ఫోన్లు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయి. మొదటి సేల్ రోజున ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Written By: Neelambaram, Updated On : August 3, 2024 2:32 pm

Poco M6 Plus 5g

Follow us on

Poco M6 Plus 5g: చైనా మొబైల్ కంపెనీ షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఆగస్టు 1న బడ్స్ ఎక్స్ 1 వైర్ లెస్ తో పాటు ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. M-సిరీస్ లైనప్ కు అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్ రింగ్ ఫ్లాష్ డిజైన్ తో కూడిన గ్లాస్ ను కలిగి ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ సెట్ తో పనిచేస్తుంది. హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్, మల్టిపుల్ సౌండ్ ప్రొఫైల్స్ సపోర్ట్ తో బడ్స్ ఎక్స్ 1 బడ్జెట్ ఆఫర్లు.

పోకో M6 ప్లస్ 5జీ ధర, లభ్యత
6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్: రూ.13,499
8 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్: రూ.14,499
కలర్స్: ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్, గ్రాఫైట్ బ్లాక్

పోకో ఎం6 ప్లస్ 5జీ, బడ్స్ ఎక్స్1 స్మార్ట్ ఫోన్లు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనున్నాయి. మొదటి సేల్ రోజున ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బేస్ మోడల్ మొదటి రోజు సేల్ లో తక్షణ డిస్కౌంట్ తో పాటు రూ. 500 కూపన్ లభిస్తుంది. పోకో బడ్స్ ఎక్స్1 ధర రూ.1,699. ఇది ప్రారంభ ధర, తరువాత మారుతుంది.

పోకో M6 ప్లస్ 5జీ వివరాలు
పోకో M6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ 6.79 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం ఐపీ53 రేటింగ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ ను పొందుపరిచారు. 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్‌తో పోకో M6ప్లస్ 5జీ పనిచేస్తుంది. M6ప్లస్ 5జీ కోసం రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్ డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్ డేట్లు అందించేందుకు పోకో కట్టుబడి ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెన్సార్ లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ (శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం 6), ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ వై ఫై రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది.

పోకో M6ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: 6.79 అంగుళాల ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్2 ఏఈ
ర్యామ్: 6 జీబీ, 8 జీబీ
స్టోరేజ్: 128 జీబీ
రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ ప్రైమరీ (శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6)
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఓఎస్: ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ హైపర్ఓఎస్
బ్యాటరీ: 5030 ఎంఏహెచ్
ఛార్జింగ్: 33 వాట్

పోకో బడ్స్ ఎక్స్1 వివరాలు..
పోకో బడ్స్ ఎక్స్1లో 40డీబీ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సలేషన్ అమర్చారు. ఇందులో 12.4 ఎంఎం డైనమిక్ టైటానియం డ్రైవర్స్, ఏఐ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్సీ)తో కూడిన క్వాడ్ మైక్ సెటప్ ఉన్నాయి. పోకో బడ్స్ ఎక్స్1 ఐదు ఇక్యూ సౌండ్ ప్రొఫైల్స్ ను అందిస్తుంది, కస్టమైజబుల్ ఆడియో సెట్టింగ్ ను అందిస్తుంది. బడ్స్ ఎక్స్1 లో ఐపీ 54 ప్రొటెక్షన్, స్థిరమైన కనెక్షన్లు, తక్కువ లెటెన్సీ కోసం బ్లూ టూత్ 5.3, సులభమైన సెటప్ కోసం గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల వస్తుంది. 7 గంటల ప్లేటైమ్ లభిస్తుందని పోకో పేర్కొంది.