బిజినెస్PM Vishwakarma Yojana: 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల రుణం.. అర్హులు వీరే

PM Vishwakarma Yojana: 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల రుణం.. అర్హులు వీరే

PM Vishwakarma Yojana: చేతి వృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనందించాలనే ఉద్దేశంతో కేంద్రం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. కరోనా సమయంలో చిరు వ్యాపారుల రుణాలు అందించి ప్రోత్సహించింది. తాజాగా చేతి వృత్తుల వారి కోసం పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తోంది. 2023, సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. తెలంగాణలో అసెంబ్లీ కోడ్‌ అమలులో ఉండడంతో దీనిని అమలు చేయలేదు. తాజాగా దీనిని తెలంగాణలో అమలుచేస్తున్నారు.

వీరు అర్హులు..
– పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వడ్రం గులు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, నాయీబ్రాహ్మణులు, రజకులు, చేపల వల తయారీదారులు, మాలలు అల్లేవారు, మే స్త్రీలు, గంపలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, చర్మకారులు, చెప్పుల తయారీదారులు, తాళాలు, ఆయుధ, కవచ తయారీదారులు.. ఇలా 18 రకాల వృత్తులవారు అర్హులు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక పీఎం ఈజీపీ, ముద్ర వంటి పథకాలతో లబ్ధి పొందనివారై ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.

దరఖాస్తు ఎలా…
అర్హులైనవారు ఆధార్‌ కార్డు, లింక్‌ అయిన మొబైల్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్‌ ప్రతులతో మీసేవ, సీఎస్సీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. బయోమెట్రిక్‌ ద్వారా దరఖాస్తు చేస్తే ఆధార్‌కు లింక్‌ ఉన్న ఫోన్ నంబర్‌ కు ఓటీపీ వస్తుంది. తద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై గ్రామస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మెప్మా అధికారులు చేపడతారు.

ఎంపికైనవారికి శిక్షణ..
ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎంపిక అయిన వారిఇ ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. శిక్షణ అనంతరం 15 రోజలు అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్, ఆ తరువాత రూ.15 వేల విలువైన టూల్‌ కిట్‌ అందిస్తారు.

రూ.లక్ష రుణం..
ఇక దరఖాస్తు దారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇస్తారు. ఈ రుణాన్ని వాయిదాల్లో చెల్లించాలి. 18 నెలల వాయిదాల్లో చెల్లిస్తే తిరిగి 5 శాతం వడ్డీతో మరో రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఈ పథకంపై చాలా మందికి అవగాహన లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Channel Chairman US Visit: ఆ న్యూస్ ఛానల్ పెద్ద అమెరికా లో హల్ చల్.. పక్కన కేఏ పాల్.. ఏదో కొడుతుంది శీనా

Channel Chairman US Visit: ఆ చానల్ పెద్ద ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో తెలియదు. ఛానల్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమం కూడా కాదు. ఇటీవల ఆయన తన కూతుర్ని...

Mamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని...

Most Popular

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...
Exit mobile version