
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి, రైతులకు ఆర్థిక మద్దతు అందించడానికి కేంద్రం వివిధ పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా 15 లక్షల రూపాయల రుణం లభించనుంది.
రైతులు అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మోదీ సర్కార్ 15 లక్షల రూపాయల ఆర్థిక మద్దతును అందించనుందని తెలుస్తోంది. గతంలోనే కేంద్రం ఈ స్కీమ్ ను ప్రకటించగా ఈ పథకానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ ద్వారా 15 లక్షల రూపాయలు పొందాలంటే 11 మంది రైతులు ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పాడాల్సి ఉంటుంది.
కంపెనీ చట్టం కింద దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర ఎక్విప్‌మెంట్లు ఇతరులకు విక్రయించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరం నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తుండటం గమనార్హం. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం వీరికి సహాయం అందించనుందని తెలుస్తోంది.
ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుండగా 11 మంది రైతులు ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరనుంది.